News January 7, 2025
దేశంలో మరో 2 hMPV కేసులు
hMP వైరస్ దేశంలో నెమ్మదిగా విస్తరిస్తోంది. నిన్నటి వరకు దేశ వ్యాప్తంగా 6 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇవాళ మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఇద్దరు చిన్నారులు వైరస్ బారిన పడ్డారు. పాజిటివ్ వచ్చిన 7, 13 ఏళ్ల చిన్నారులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. నిన్న చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతాలో కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Similar News
News January 9, 2025
కొత్త వైరస్.. ఒంగోలు GGHలో 20 బెడ్లు ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ఎంపీ వైరస్ నివారణలో భాగంగా.. ఒంగోలులోని GGHలో 20 బెడ్లు ఏర్పాటు చేశామని, ఎక్స్‌పర్ట్ కమిటీతోపాటు పలు కమిటీలను నియమించామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున తెలిపారు. మగవారికి 10 బెడ్లు, మహిళలకు 10 బెడ్ల చొప్పున ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. డాక్టర్ కళ్యాణి HOD జనరల్ మెడిసిన్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని చెప్పుకొచ్చారు.
News January 9, 2025
హెల్మెట్ ధారణలో పురోగతి: హైకోర్టు
AP: ప్రతి 10 మంది ద్విచక్రవాహనదారుల్లో ముగ్గురు హెల్మెట్ ధరిస్తున్నారని హైకోర్టు తెలిపింది. తమ ఆదేశాలతో చేపట్టిన చర్యల వల్ల పురోగతి కనిపిస్తోందని సంతృప్తి వ్యక్తం చేసింది. గత 20 రోజుల్లో రూ.95 లక్షల చలాన్లు వసూలు చేశారని, ఫైన్లు విధించడమూ పెరిగిందని వ్యాఖ్యానించింది. హెల్మెట్ ధరించకపోవడం జరిగే నష్టాలను పత్రికలు, టీవీల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని మరోసారి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
News January 9, 2025
ఇచ్ఛాపురంలో స్వల్ప భూ ప్రకంపనలు
AP: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. బుధవారం రాత్రి 10:56 గంటలకు 2 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. అలాగే గురువారం తెల్లవారుజామున 4:55 గంటల సమయంలో మరోసారి స్వల్పంగా భూమి కంపించిందని తెలిపారు. దీంతో ఇచ్ఛాపురం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం అక్టోబరులోనూ ఇలాగే భూ ప్రకంపనలు వచ్చాయని చెబుతున్నారు.