News March 17, 2024
అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పొదెం వీరయ్య

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పదవి దక్కింది. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నాయకుడిగా పొదెం గుర్తింపు పొందారు. పార్టీ నాయకులు, కార్యకర్తల్ని ఏకతాటిపై నడిపించారు.
Similar News
News January 5, 2026
ఖమ్మంలో ఈ నెల 10 నుంచి టీసీసీ పరీక్షలు

ఖమ్మం జిల్లాలో ఈ నెల 10 నుంచి 13 వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (TCC) పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ చైతన్య జైని తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News January 5, 2026
పాక్షికంగా అందుబాటులోకి ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే పనులు తుది దశకు చేరుకోవడంతో వచ్చే నెలలో వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు రాకపోకలను పాక్షికంగా ప్రారంభించేందుకు NHAI సిద్ధమవుతోంది. హైదరాబాద్-వైజాగ్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ రహదారిలో మధ్య సెక్షన్ పూర్తవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త మార్గం వల్ల పాత రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి.
News January 4, 2026
ఖమ్మం: 150 మంది డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు

రవాణా మాసోత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య, కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 150 మంది డ్రైవర్లు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. ఎంవీఐలు దినేష్, సుమలత, రవిచందర్, వైద్యులు గౌతమ్, నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డ్రైవర్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమని అధికారులు పేర్కొన్నారు.


