News January 7, 2025
రోహిత్, కోహ్లీ కమ్‌బ్యాక్ చేస్తారు: యువరాజ్
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తన కుటుంబం అని భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అన్నారు. ఆ ఫ్యామిలీకి మద్దతుగా నిలవడం తన బాధ్యత అని చెప్పారు. వారు కచ్చితంగా గట్టి కమ్‌బ్యాక్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన BGTలో రోహిత్, విరాట్ ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. వచ్చే నెల ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో రాణించేందుకు వీరిద్దరూ సన్నద్ధమవుతున్నారు.
Similar News
News January 9, 2025
నేడు మీ టికెట్ యాప్ సేవలు ప్రారంభం
TG: సమయాన్ని వృథా చేయకుండా ఉన్న చోటు నుండే టికెట్లు బుక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీ టికెట్ యాప్ తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్ సేవలను ప్రభుత్వం నేడు ప్రారంభించనుంది. దీని ద్వారా రాష్ట్రంలోని జూ పార్క్‌లు, మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు, ఆలయాలు, పార్కులు, క్రీడలకు సంబంధించిన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దీంతో సులభంగా ప్రవేశం పొందవచ్చని పేర్కొంది.
News January 9, 2025
తిరుపతి బాధితులకు నేడు పరిహారం ప్రకటన
AP: తిరుపతి తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాలకు నేడు CM చంద్రబాబు పరిహారం ప్రకటిస్తారని TTD ఛైర్మన్ B R నాయుడు తెలిపారు. ఘటనపై ఆయన చాలా సీరియస్ అయ్యారని చెప్పారు. టోకెన్ కేంద్రం వద్ద ఉన్న DSP గేట్లు తెరవడంతో భక్తులందరూ తోసుకురావడం వల్లే ఘటన జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనం 19వరకు ఉంటుందని వెల్లడించారు.
News January 9, 2025
మైత్రీ మూవీ మేకర్స్‌పై చర్యలు తీసుకోండి: అడ్వకేట్
మైత్రీ మూవీ మేకర్స్, జై హనుమాన్ చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ తిరుమలరావు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. జై హనుమాన్ మూవీ టీజర్‌లో హనుమంతుడిని కించపరిచేలా సీన్లు ఉన్నాయని ఆరోపించారు. టీజర్‌లో హనుమంతుడికి బదులు రిషబ్ శెట్టి ముఖం చూపించడంతో భవిష్యత్ తరాలకు హనుమాన్ అంటే ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వెంటనే వాటిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.