News January 7, 2025
భారీ భూకంపం.. 53కి చేరిన మరణాలు
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. టిబెట్‌లో ఇప్పటివరకు 53 మంది మరణించినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. 62 మందికి గాయాలైనట్లు తెలిపింది. 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు పేర్కొంది.
Similar News
News January 9, 2025
నేడు తిరుపతికి పవన్ కళ్యాణ్
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ మధ్యాహ్నం తిరుపతి వెళ్లనున్నారు. తొక్కిసలాటలో గాయపడిన బాధితులను ఆయన పరామర్శిస్తారు. పవన్ తిరుమల వెళ్లేందుకు ఇవాళ్టి తన పర్యటనలు అన్నీ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.
News January 9, 2025
తిరుపతి ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
తిరుపతిలో టికెట్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణాలు చోటు చేసుకోవడం బాధించినట్లు ట్వీట్ చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా ఈ ఘటనలో ఆరుగురు మరణించగా 40 మంది గాయపడ్డారు.
News January 9, 2025
మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్?
TG: అభయహస్తం పథకంలోని రూ.385 కోట్ల నిధులను మహిళలకు తిరిగివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2009లో అభయహస్తం పథకంలో భాగంగా మహిళలు రోజుకు రూపాయి చొప్పున ఆరేళ్లపాటు చెల్లించారు. ఈ నిధులను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించినట్లు సర్కార్ గుర్తించింది. 2022 నాటికి ఆ డబ్బులు వడ్డీతో కలిపి రూ.545 కోట్లకు చేరాయి. ఇప్పుడు వీటిని తిరిగివ్వాలని రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం.