News January 7, 2025
రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్

నటి సనా ఖాన్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘సరైన సమయంలో దేవుడు అనుగ్రహిస్తాడు. అది జీవితంలో ఆనందాన్ని నింపుతుంది’ అని రాసుకొచ్చారు. 2020లో ఆమె ముస్లిం మతగురువు అనాస్ సయ్యద్‌ను పెళ్లి చేసుకోగా 2023లో ఓ బాబు జన్మించాడు. సనా ఖాన్ తెలుగులో కత్తి, గగనం, మిస్టర్ నూకయ్య లాంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
Similar News
News January 9, 2026
మహిళలూ.. ఈ లక్షణాలున్నాయా? జాగ్రత్త

క్యాన్సర్ లక్షణాలు అన్నిసార్లూ బయటకు కనిపించవు. ముఖ్యంగా మహిళల్లో కొన్ని క్యాన్సర్లు నిశ్శబ్ధంగా శరీరంలో వ్యాపిస్తాయంటున్నారు నిపుణులు. చాలా క్యాన్సర్లను ప్రారంభదశలో గుర్తించడం కష్టమని చెబుతున్నారు. అందుకే మహిళల్లో అసాధారణ వాపు, దీర్ఘకాల అలసట, కారణం లేకుండా బరువు తగ్గడం, చర్మంపై మార్పులు, అసాధారణ రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News January 9, 2026
AIIMS పట్నాలో 117 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

AIIMS పట్నాలో 117 సీనియర్ రెసిడెంట్(నాన్ అకడమిక్) పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS/MD/MS/DNB/DM/M.Ch ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://api.aiimspatna.edu.in/
News January 9, 2026
మాయదారి మాంజా.. బాలుడి మెడకు 16 కుట్లు

TG: సంక్రాంతి వేళ మాయదారి మాంజా పలువురి ఇళ్లలో విషాదం నింపుతోంది. ఇటీవల HYD శివారు కీసరలో చైనా మాంజా మెడకు తగిలి జశ్వంత్ అనే యువకుడికి 19 కుట్లు పడ్డాయి. తాజాగా జగిత్యాల జిల్లా మెట్పల్లి దుబ్బవాడలో నాలుగేళ్ల చిన్నారి శ్రీహాన్‌కు తీవ్ర గాయమైంది. మాంజా దారం అతడి మెడను కోసేసింది. దీంతో వైద్యులు 16 కుట్లు వేశారు.
** మాంజా వాడకండి.. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టకండి


