News January 7, 2025
నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో సురేశ్ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News January 13, 2025
శ్రీవారి పరకామణిలో చోరీ.. వెలుగులోకి సంచలన విషయాలు
AP: తిరుమల శ్రీవారి పరకామణిలో 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ చోరీ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కాంట్రాక్ట్ ఉద్యోగి పెంచలయ్య కొన్ని నెలలుగా ఇదే తరహాలో దొంగతనాలు చేసినట్లు వెల్లడైంది. అతని నుంచి 555 గ్రాముల బంగారు బిస్కెట్‌లు, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.అర కోటి ఉంటుందని తెలిపారు.
News January 13, 2025
పసుపు బోర్డు ఏర్పాటు హర్షణీయం: కిషన్ రెడ్డి
తెలంగాణలోని నిజామాబాద్‌లో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తుండటంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావద్దేశానికి సంక్రాంతి కానుక అని తెలిపారు. రేపటి నుంచి పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనుందని, ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ దీన్ని ఏర్పాటు చేస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.
News January 13, 2025
పెరుగుతున్న స్కార్లెట్ ఫీవర్ కేసులు
హైదరాబాద్‌లో కొద్దిరోజులుగా స్కార్లెట్ ఫీవర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 5-15 ఏళ్ల పిల్లలకు వ్యాపించే ఈ వైరస్‌తో ఆహారంపై అనాసక్తి, తీవ్రజ్వరం, నాలుక కందిపోవడం, నోట్లో పొక్కులు, గొంతులో మంట, నీరసం వంటి లక్షణాలుంటాయి. వీటితో పాటు 2-5 రోజుల్లో ఆయాసం, ముఖం వాపు, మూత్రం తగ్గడం, మూత్రంలో రక్తం గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.