News January 7, 2025
కోటి ఎకరాలకు ‘రైతు భరోసా’?
TG: ఈనెల 26 నుంచి ‘రైతు భరోసా’ సాయాన్ని పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. యాసంగి సీజన్‌కు సంబంధించి ఎకరానికి ₹6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. సాగు భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇస్తున్న నేపథ్యంలో దాదాపు కోటి ఎకరాలకు ఈ పథకం అమలయ్యే అవకాశం ఉంది. అంటే ₹5,500 కోట్ల నుంచి ₹6,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. గత ప్రభుత్వం 1.52 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయాన్ని అందించింది.
Similar News
News January 9, 2025
తొక్కిసలాట ఘటన.. 40 మంది డిశ్చార్జ్
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ 40 మందిని డిశ్చార్జ్ చేశామని అధికారులు తెలిపారు. 48 మంది అస్వస్థతకు గురయ్యారని, వారికి రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స అందించామని చెప్పారు. వారిలో 40 మందిని డిశ్చార్జ్ చేయగా, మరో 8 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. సీఎం చంద్రబాబు నేడు తిరుపతికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మరణించారు.
News January 9, 2025
బ్రేక్‌ఫాస్ట్ ఏ సమయంలో తింటున్నారు?
కొందరు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి బద్ధకిస్తుంటారు. కానీ ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 7 నుంచి 8 గంటల సమయంలో అల్పాహారం తీసుకోవాలి. ఉదయం 9 గంటల తర్వాత తినకూడదు. ఇలా చేస్తే డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఆలస్యంగా టిఫిన్ చేస్తే గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఉంది. జీవక్రియకు కూడా ఆటంకం కలుగుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌కు, లంచ్‌కు కనీసం 4 గంటల గ్యాప్ ఉండాలి.
News January 9, 2025
హనీరోజ్‌ను వేధించిన బిజినెస్‌మ్యాన్ అరెస్ట్
హీరోయిన్ హనీరోజ్‌ను <<15073430>>వేధించిన<<>> ప్రముఖ బిజినెస్‌మ్యాన్ బాబీ చెమ్మనూర్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వయనాడ్‌లో ఆయనను అదుపులోకి తీసుకుని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాబీ గతంలో హనీరోజ్‌ను కొన్ని ఈవెంట్లకు ఆహ్వానించారు. కానీ ఆమె వాటికి హాజరుకాకపోవడంతో సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్టులు పెట్టారు. దీనిపై హనీ రోజ్ ఎర్నాకుళం పీఎస్‌లో ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్ చేశారు.