News January 7, 2025

అది సిద్దరామయ్య ఫేర్‌వెల్ మీటింగే: BJP

image

కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. DyCM DK శివకుమార్ లేకుండా CM సిద్దరామయ్య అతిథిగా మంత్రుల మీటింగ్స్ జరుగుతున్నాయి. JAN 2, నిన్న రాత్రి మీటింగ్స్ జరగడంతో కాంగ్రెస్‌లో విభేదాలు మొదలయ్యాయని BJP విమర్శించింది. నిన్న జరిగింది సిద్దూ ఫేర్‌వెల్ మీటింగని ఆరోపించింది. ఒకరికి ఒకే పదవి విధానాన్ని సిద్దూ హైకమాండ్ వద్ద ప్రతిపాదించడంతో DKను PCC చీఫ్‌గా నియమిస్తారని వార్తలు రావడం తెలిసిందే.

Similar News

News January 13, 2025

పసుపు బోర్డు ఏర్పాటు హర్షణీయం: కిషన్ రెడ్డి

image

తెలంగాణలోని నిజామాబాద్‌లో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తుండటంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావద్దేశానికి సంక్రాంతి కానుక అని తెలిపారు. రేపటి నుంచి పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనుందని, ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ దీన్ని ఏర్పాటు చేస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.

News January 13, 2025

పెరుగుతున్న స్కార్లెట్ ఫీవర్ కేసులు

image

హైదరాబాద్‌లో కొద్దిరోజులుగా స్కార్లెట్ ఫీవర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 5-15 ఏళ్ల పిల్లలకు వ్యాపించే ఈ వైరస్‌తో ఆహారంపై అనాసక్తి, తీవ్రజ్వరం, నాలుక కందిపోవడం, నోట్లో పొక్కులు, గొంతులో మంట, నీరసం వంటి లక్షణాలుంటాయి. వీటితో పాటు 2-5 రోజుల్లో ఆయాసం, ముఖం వాపు, మూత్రం తగ్గడం, మూత్రంలో రక్తం గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.

News January 13, 2025

యూజీసీ నెట్ పరీక్ష వాయిదా

image

ఎల్లుండి(15న) జరగాల్సిన యూజీసీ నెట్ పరీక్షను NTA వాయిదా వేసింది. అభ్యర్థుల వినతి మేరకు సంక్రాంతి, పొంగల్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. కొత్త డేట్‌ను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. అటు 16న జరగాల్సిన ఎగ్జామ్ యథావిధిగా కొనసాగుతుందని చెప్పింది. కాగా యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ పరీక్షలు ఈనెల 3 నుంచి ప్రారంభమయ్యాయి.