News January 7, 2025
జాహ్నవికి న్యాయం దక్కింది
2023 జనవరిలో అమెరికా సియాటెల్‌లో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని మరణించిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23)కి ఎట్టకేలకు న్యాయం దక్కింది. కారును అతివేగంగా నడిపిన కెవిన్ డేవ్ అనే పోలీస్‌ను ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. ఆమె మరణం పట్ల హేళనగా, నవ్వుతూ మాట్లాడిన <<13652111>>డానియెల్ అడెరర్ను<<>> ఇప్పటికే సస్పెండ్ చేశారు. ‘ఆమె మరణానికి విలువలేదు’ అంటూ అడెరర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనమయ్యాయి.
Similar News
News January 9, 2025
ఆ హీరోతో మల్టీస్టారర్ చేస్తా: రామ్ చరణ్
సీనియారిటీ పరంగా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మల్టీస్టారర్ చేస్తానని హీరో రామ్ చరణ్ చెప్పారు. ఇప్పటికే ఈ హీరో ఎన్టీఆర్‌తో RRRలో నటించిన సంగతి తెలిసిందే. ఓ షోలో RC తన ఇష్టాయిష్టాలను వెల్లడించారు. తనతో నటించిన హీరోయిన్లలో సమంత బెస్ట్ అని తెలిపారు. అక్కాచెల్లెళ్లలో తనకు సుస్మిత అక్క అంటే ఇష్టమని పేర్కొన్నారు. భార్య ఉపాసన అంటే భయం లేకున్నా ఉన్నట్లుగా నటిస్తానని అన్నారు.
News January 9, 2025
నేడు తిరుపతికి పవన్ కళ్యాణ్
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ మధ్యాహ్నం తిరుపతి వెళ్లనున్నారు. తొక్కిసలాటలో గాయపడిన బాధితులను ఆయన పరామర్శిస్తారు. పవన్ తిరుమల వెళ్లేందుకు ఇవాళ్టి తన పర్యటనలు అన్నీ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.
News January 9, 2025
తిరుపతి ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
తిరుపతిలో టికెట్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణాలు చోటు చేసుకోవడం బాధించినట్లు ట్వీట్ చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా ఈ ఘటనలో ఆరుగురు మరణించగా 40 మంది గాయపడ్డారు.