News January 7, 2025
ఏకకాలంలో 3 భాషల్లో ‘డాకు మహారాజ్’ విడుదల!
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ సినిమా ఈనెల 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళంలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు సినీవర్గాలు తెలిపాయి. తమిళంతోపాటు హిందీలో బిగ్ సినిమాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా తెలుగులో ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహరాజ్’ సినిమాల హవా నడవనుంది.
Similar News
News January 9, 2025
తిరుమల తొక్కిసలాట.. తప్పెవరిది?
AP: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు. ఈ ఘటనలో తప్పెవరిది అనేదానిపై చర్చ జరుగుతోంది. టికెట్లు దొరకవేమోనన్న కంగారుతో భక్తులు ఒక్కసారిగా తోపులాడుకోవడం వారి తప్పు. ఒకేసారి గేట్లు తెరవడం పోలీసుల తప్పు. టికెట్ల జారీపై నిర్దిష్ట ప్రమాణాలు పాటించకపోవడం, ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే అంచనా వేయలేకపోవడం టీటీడీ తప్పు అని చర్చ జరుగుతోంది.
News January 9, 2025
అంతా కేటీఆర్ చెప్పినట్లే చేశాం..
TG: ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో KTR చెప్పినట్లే తాము చేశామని IAS అర్వింద్ కుమార్, BLN రెడ్డి విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. అర్వింద్‌ను ఏసీబీ, రెడ్డిని ఈడీ నిన్న ప్రశ్నించాయి. విదేశీ కంపెనీకి నేరుగా నిధులు చెల్లిస్తే సమస్యలొస్తాయని చెప్పినా తాను చూసుకుంటానని ఆయన అన్నారని అర్వింద్ చెప్పినట్లు సమాచారం. రేసింగ్ వ్యవహారంలో తాను నిమిత్తమాత్రుడినేనని రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.
News January 9, 2025
తొక్కిసలాట ఘటన.. 40 మంది డిశ్చార్జ్
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ 40 మందిని డిశ్చార్జ్ చేశామని అధికారులు తెలిపారు. 48 మంది అస్వస్థతకు గురయ్యారని, వారికి రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స అందించామని చెప్పారు. వారిలో 40 మందిని డిశ్చార్జ్ చేయగా, మరో 8 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. సీఎం చంద్రబాబు నేడు తిరుపతికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మరణించారు.