News January 7, 2025
ఎదురుదెబ్బల నుంచి బలంగా పుంజుకుంటాం: కేటీఆర్
TG: ఫార్ములా-ఈ కారు కేసులో జరుగుతున్న పరిణామాలపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మీ అబద్ధాలు నన్ను అడ్డుకోలేవు. మీ ఆరోపణలు నన్ను నాశనం చేయలేవు. మీ కుట్రలు నా నోరు మూయించలేవు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి నాంది. నేను న్యాయానికి గౌరవిస్తాను. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. నా మాటలు రాసిపెట్టుకోండి. ఎదురుదెబ్బల నుంచి బలంగా పుంజుకుంటాం’ అని రాసుకొచ్చారు.
Similar News
News January 9, 2025
తిరుపతి తొక్కిసలాట.. సీఎం రాజీనామా చేయాలి: రోజా
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురి చావుకు కారణమైన సీఎం చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ నేత రోజా డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగాన్ని సీఎం పర్యటనకు వినియోగించుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి సామాన్యులంటే ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. ఈ ఘటనలో టీటీడీ ఛైర్మన్, ఈవో, ఎస్పీ, ఇతర అధికారులపై కేసు నమోదు చేయాలన్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలన్నారు.
News January 9, 2025
ఈ నెల 25 తర్వాత సేవలన్నీ నిలిపేస్తాం: ఆశా
AP: బకాయిలు చెల్లించకపోతే NTR వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ నెల 25 తర్వాత వైద్య సేవలన్నీ నిలిపేస్తామని ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) తెలిపింది. ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్తో జరిగిన భేటీలో ఆశా ప్రతినిధులు మాట్లాడుతూ రూ.500కోట్లు విడుదల చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, రూ.1000కోట్లు విడుదల చేస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు. 6వ తేదీ నుంచి ఓపీ, EHS సేవలు నిలిపేసిన విషయం తెలిసిందే.
News January 9, 2025
రేపటి నుంచి సెలవులు
APలోని స్కూళ్లకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. జనవరి 19 (ఆదివారం) వరకు సెలవులు ఉంటాయి. 20వ తేదీ పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. కాలేజీలకు సెలవులపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి మీరు సంక్రాంతికి ఎక్కడికి వెళ్తున్నారు? ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? కామెంట్ చేయండి.