News January 7, 2025
భారత్‌లో మైక్రోసాఫ్ట్ 3 బిలియన్ డాలర్ల పెట్టుబడి
భారత్‌లో క్లౌడ్, ఏఐ మౌలికవసతుల విస్తరణకు 3 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. ‘భారత్‌లో మునుపెన్నడూ లేని స్థాయిలో భారీగా విస్తరించనున్నాం. మా అజూర్ సామర్థ్యాన్ని మరింతగా పెంచనున్నాం. ప్రధానంగా వివిధ ప్రాంతాలకు సంస్థను విస్తరిస్తున్నాం. 2030నాటికి కోటిమందిని ఏఐ నిపుణులుగా మారుస్తాం’ అని స్పష్టం చేశారు.
Similar News
News January 9, 2025
అంతా కేటీఆర్ చెప్పినట్లే చేశాం..
TG: ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో KTR చెప్పినట్లే తాము చేశామని IAS అర్వింద్ కుమార్, BLN రెడ్డి విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. అర్వింద్‌ను ఏసీబీ, రెడ్డిని ఈడీ నిన్న ప్రశ్నించాయి. విదేశీ కంపెనీకి నేరుగా నిధులు చెల్లిస్తే సమస్యలొస్తాయని చెప్పినా తాను చూసుకుంటానని ఆయన అన్నారని అర్వింద్ చెప్పినట్లు సమాచారం. రేసింగ్ వ్యవహారంలో తాను నిమిత్తమాత్రుడినేనని రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.
News January 9, 2025
తొక్కిసలాట ఘటన.. 40 మంది డిశ్చార్జ్
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ 40 మందిని డిశ్చార్జ్ చేశామని అధికారులు తెలిపారు. 48 మంది అస్వస్థతకు గురయ్యారని, వారికి రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స అందించామని చెప్పారు. వారిలో 40 మందిని డిశ్చార్జ్ చేయగా, మరో 8 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. సీఎం చంద్రబాబు నేడు తిరుపతికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మరణించారు.
News January 9, 2025
బ్రేక్‌ఫాస్ట్ ఏ సమయంలో తింటున్నారు?
కొందరు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి బద్ధకిస్తుంటారు. కానీ ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 7 నుంచి 8 గంటల సమయంలో అల్పాహారం తీసుకోవాలి. ఉదయం 9 గంటల తర్వాత తినకూడదు. ఇలా చేస్తే డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఆలస్యంగా టిఫిన్ చేస్తే గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఉంది. జీవక్రియకు కూడా ఆటంకం కలుగుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌కు, లంచ్‌కు కనీసం 4 గంటల గ్యాప్ ఉండాలి.