News March 17, 2024
ప.గో. జిల్లాలో YCP నుంచి ఐదుగురు కొత్తగా

ఉమ్మడి జిల్లాలో ఈసారి ఐదుగురు కొత్తవారికి వైసీపీ అవకాశం కల్పించింది. ఏలూరు ఎంపీ అభ్యర్థి సునీల్‌కుమార్ యాదవ్, నరసాపురం ఎంపీ అభ్యర్థి ఉమాబాల, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి విజయరాజు (రిటైర్డ్ రవాణా శాఖ అధికారి), పోలవరం అసెంబ్లీ అభ్యర్థి రాజ్యలక్ష్మి (ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ), పాలకొల్లు అసెంబ్లీ అభ్యర్థి గుడాల గోపికి పార్టీ అవకాశం ఇచ్చింది.
Similar News
News January 25, 2026
పశ్చిమగోదావరి జిల్లాకు రాష్ట్రస్థాయి పురస్కారం

ఓటర్ల నమోదులో విశేష ప్రతిభ కనబరిచినందుకు ప.గో జిల్లాకు రాష్ట్రస్థాయిలో “ఉత్తమ ఎన్నికల విధానాల అవార్డు-2025” లభించింది. ఆదివారం విజయవాడలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చేతుల మీదుగా కలెక్టర్ నాగరాణి పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు అంశాల్లో 12 జిల్లాలను ఎంపిక చేయగా, అత్యధిక ఓటర్ల నమోదులో ప.గో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.
News January 25, 2026
తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీలో చీలిక?

తాడేపల్లిగూడెం టీడీపీలో వర్గ పోరు రచ్చకెక్కింది. మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకలను నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వలవల బాబ్జీ, పసల కొండ వర్గాలు విడివిడిగా నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. పార్టీ రెండుగా చీలినట్లు కనిపిస్తున్న ఈ పరిణామాలు కార్యకర్తల్లో గందరగోళం రేపుతున్నాయి. ఈ అంతర్గత విభేదాలు మున్ముందు ఏ దారి తీస్తాయోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
News January 25, 2026
ప.గో: బస్ ఎక్కుతూ తొక్కిసలాటలో వృద్ధుడు మృతి?

పాలకొల్లు బస్టాండ్‌లో బస్సు ఎక్కుతుండగా జరిగిన తొక్కిసలాటలో వేడంగికి చెందిన బుడితి మనోహర్(65) మృతి చెందారు. శనివారం సాయంత్రం ఏలూరు బస్సు కోసం ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఆయన కింద పడిపోయారు. ప్రమాదం బస్సు తగలడం వల్ల జరిగిందా లేక తొక్కిసలాటలోనా అన్నది పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. సీఐ రజనీ కుమార్ పర్యవేక్షణలో ఎస్ఐ పృథ్వీ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


