News January 7, 2025
స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం ఆదుకుంటుంది: పురందీశ్వరి
AP: రేపు PM మోదీ వైజాగ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లను రాష్ట్ర BJP చీఫ్ పురందీశ్వరి పరిశీలించారు. స్టీల్ ప్లాంట్‌ను గాడిలో పెట్టాలని కేంద్రం భావిస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘కూటమి సర్కారు ఏర్పడ్డాక తొలిసారిగా PM విశాఖకు వస్తున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభిస్తారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మంచి ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది’ అని వెల్లడించారు.
Similar News
News January 12, 2025
బహిరంగ మద్యం విక్రయాలను అడ్డుకుంటాం: విజయవాడ సీపీ
AP: కోడి పందేల శిబిరాలను డ్రోన్లతో పర్యవేక్షించనున్నట్లు విజయవాడ సీపీ రాజశేఖర్ తెలిపారు. శిబిరాల వద్ద బహిరంగ మద్యం విక్రయాలను అడ్డుకుంటామన్నారు. కోళ్లకు కత్తి కట్టి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుండాట, పేకాట, క్యాసినోలు జరగనివ్వమని చెప్పారు. సంక్రాంతి అంటే కోడి పందేలు, జూదం, గుండాట, క్యాసినో కాదని అన్నారు. సంప్రదాయ ఆటలు ఆడుతూ పండుగ జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.
News January 12, 2025
BJP దూకుడు: మహిళలకు పగ్గాలిచ్చేందుకు రెడీ
డీలిమిటేషన్ ప్రాసెస్ మొదలయ్యే సరికి మహిళా నాయకత్వాన్ని పెంచుకొనేందుకు BJP కసరత్తు ఆరంభించింది. బూత్ లెవల్ నుంచి నేషనల్ వరకు పార్టీ పగ్గాలను సముచిత స్థాయిలో వారికే అప్పగించనుందని తెలిసింది. నడ్డా స్థానంలో BJPకి కొత్త ప్రెసిడెంట్ వచ్చేలోపు states, dists, mandals, village స్థాయుల్లో 30% వరకు స్త్రీలకే బాధ్యతలు అప్పగించనుంది. MPని మోడల్ స్టేట్‌గా ఎంచుకుంది. 2026 నుంచి విమెన్ రిజర్వేషన్లు అమలవుతాయి.
News January 12, 2025
గంటల కొద్దీ చూడటం నా భార్యకెంతో ఇష్టం: ‘కొవిషీల్డ్’ సీరమ్ అధిపతి
తన భార్యకూ తనను చూస్తూ ఉండిపోవడమంటే చాలా ఇష్టమని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అధినేత అదార్ పూనావాలా అన్నారు. వారానికి 90 గంటల పని అంశంపై స్పందించారు. క్వాంటిటీ కన్నా క్వాలిటీ వర్క్‌కే ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆనంద్ మహీంద్రాతో ఏకీభవించారు. ‘అవును మహీంద్రా. నా భార్య నటాషా కూడా నేనెంతో అద్భుతంగా ఉన్నానని అనుకుంటుంది. ఆదివారాలు నన్నలా చూస్తూ ఉండిపోవడం ఆమెకెంతో ఇష్టం. #worklifebalance’ అని ట్వీట్ చేశారు.