News March 17, 2024

RTC ఉద్యోగులకు ప్రభుత్వం షాక్

image

TG: ఆర్టీసీ ఉద్యోగులకు ఇటీవల వేతనాలు పెంచిన ప్రభుత్వం HRAలో కోత విధించింది. పనిచేసే ప్రాంతాన్ని బట్టి ఇంటి అద్దె భత్యం స్లాబుల్లో మార్పులు చేసింది. దీనివల్ల GHMC పరిధిలో పనిచేసే ఉద్యోగులకు అధిక నష్టం కలగనుంది. ఇక్కడ ఇప్పటివరకు 30% ఉన్న HRAను 24శాతానికి పరిమితం చేసింది. అలాగే KNR, ఖమ్మం, MBMR, NZB, గోదావరిఖని, WGLలో పనిచేసే వారికి 17%, మిగతా జిల్లాల్లోని వారికి 13-11 శాతానికి తగ్గించింది.

Similar News

News December 23, 2024

రాష్ట్రంలో మరిన్ని సంతాన సాఫల్య కేంద్రాలు

image

TG: సంతాన లేమి సమస్యతో బాధపడుతున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే HYDలోని గాంధీ, పేట్ల బురుజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐవీఎఫ్ కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం మరిన్ని జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. వరంగల్ ఎంజీఎంలో ఏర్పాటుకు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. HYD, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, MBNRలోనూ ఏర్పాటు చేయనుంది.

News December 23, 2024

కులాంతర వివాహం చేసుకుంటే రూ.2.5లక్షలు.. వివరాలివే

image

TG: కులాంతర వివాహం చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ‘ఇంటర్ క్యాస్ట్ ఇన్సెంటివ్ స్కీమ్’ కింద రూ.2.5 లక్షల ఆర్థికసాయం అందిస్తోంది. వధూవరులు TG వాసులై, ఇద్దరిలో ఒకరు కచ్చితంగా ఎస్సీ వారై ఉండాలి. అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు పూర్తై ఉండాలి. పెళ్లైన ఏడాదిలోపే అప్లై చేసుకోవాలి. తొలి వివాహానికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News December 23, 2024

పరవాడ ఫార్మా సిటీలో ప్రమాదం

image

AP: అనకాపల్లి జిల్లా ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. రక్షిత డ్రగ్స్‌లో విషవాయువు లీక్ కావడంతో ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురి కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు.