News January 7, 2025

మెదక్: గీత కార్మికులకు ప్రభుత్వం చేయూత: మంత్రి పొన్నం

image

గీత కార్మికులకు ప్రజా ప్రభుత్వం చేయూత ఇస్తుందని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  పేర్కొన్నారు. మొదటి విడతలో 15 వేల మంది గీతా కార్మికులకు శిక్షణ ఇచ్చి కాటమయ్య రక్షణ కవచ కిట్లు పంపిణీ చేశామన్నారు. ఈనెల 25 లోపు రెండవ విడత కాటమయ్య రక్షణ కవచ కిట్లు పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.

Similar News

News October 30, 2025

వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి: డీఐఈవో

image

రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యా బోధన చేయాలని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి(డీఐఈవో) మాధవి ఆదేశించారు. బుధవారం ఆమె జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించిన మాధవి, విద్యార్థులతో మాట్లాడి సబ్జెక్టుల వివరాలు అడిగారు. ప్రతి విద్యార్థిపై అధ్యాపకులు శ్రద్ధ చూపాలని దిశానిర్దేశం చేశారు.

News October 30, 2025

నూతన క్వారీలకు అనుమతి తప్పనిసరి: మెదక్ కలెక్టర్

image

మెదక్ జిల్లాలో మైనింగ్, క్వారీ లీజు రెన్యువల్, నూతన క్వారీల మంజూరు కోసం రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అధ్యయన సంస్థ(సీయా) జారీ చేసే పర్యావరణ అనుమతి తప్పనిసరని కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జిల్లా సర్వే నివేదికను రూపొందించినట్లు తెలిపారు.

News October 29, 2025

మెదక్: అమరుడికి నివాళులర్పించిన అదనపు ఎస్పీ

image

మెదక్ పట్టణం జంబికుంటలో నివాసం ఉంటున్న అమరుడు ఆబేద్ హుస్సేన్ కుటుంబాన్ని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ఈరోజు పరామర్శించారు. పాపన్నపేట పోలీస్ స్టేషన్ పై బాంబు దాడిలో మృతిచెందిన ఆబేద్ హుస్సేన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని మహేందర్ హామీ ఇచ్చారు. డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ మహేశ్ పాల్గొన్నారు.