News January 7, 2025

BREAKING: ప్రణబ్ ముఖర్జీ స్మారకానికి కేంద్రం అనుమతి

image

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారకానికి కేంద్రం అనుమతించింది. తమ కుటుంబం అడగనప్పటికీ PM మోదీజీ న్యూఇయర్ గిఫ్ట్‌గా దీనిని బహూకరించారని ఆయన కుమార్తె శర్మిష్ఠ అన్నారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. జనవరి 1నే లేఖ వచ్చినప్పటికీ ప్రభుత్వం ప్రకటించేంత వరకు ఎవరికీ చెప్పలేదన్నారు. ప్రణబ్‌తో అనుబంధాన్ని మోదీ గుర్తు చేసుకున్నారని వివరించారు. మన్మోహన్ సింగ్ స్మారకాన్ని కాంగ్రెస్ వివాదాస్పదం చేసిందన్నారు.

Similar News

News January 12, 2025

దక్షిణాదిపై కేంద్రం వివక్ష: డీఎంకే మంత్రి

image

పన్నుల వాటాలో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని తమిళనాడు డీఎంకే మంత్రి తంగం తెనరసు విమర్శించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో 31.5 కోట్ల జనాభా ఉంటే రూ.27,336 కోట్లు కేటాయించిందని చెప్పారు. అదే యూపీ, బిహార్, MPల్లో 44.3 కోట్ల జనాభా ఉంటే రూ.62,024 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. దక్షిణాదికి 15%, ఆ 3 రాష్ట్రాలకు 40% ఇవ్వడం వివక్ష కాదా? అని ప్రశ్నించారు.

News January 12, 2025

కొత్త కెప్టెన్‌ను వెతకండి: BCCIతో రోహిత్ శర్మ!

image

టీమ్ఇండియాకు కొత్త కెప్టెన్‌ను వెతకాలని BCCIకి రోహిత్ శర్మ సూచించినట్టు తెలిసింది. CT25 సహా మరికొన్ని నెలలు తననే కొనసాగించాలని కోరినట్టు సమాచారం. జట్టు ప్రదర్శనపై శనివారం బోర్డు సమీక్షలో హిట్‌మ్యాన్, కోచ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్‌ తమ అభిప్రాయాలు చెప్పారు. బుమ్రాకు నాయకత్వం అప్పగించేందుకు కొందరు విముఖత చూపారని తెలిసింది. దీంతో ఇంగ్లాండుతో 5 టెస్టుల సిరీసుకు నాయకత్వంపై సందిగ్ధం నెలకొంది.

News January 12, 2025

పోప్ ఫ్రాన్సిస్‌కు అమెరికా అత్యున్నత పురస్కారం

image

పోప్ ఫ్రాన్సిస్‌కు అమెరికా సర్కారు తమ అత్యున్నత పురస్కారం మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ ప్రకటించింది. ఈ నెల 20న జో బైడెన్ పదవీకాలం ముగియనుంది. ఈలోపుగా పలు కీలక నిర్ణయాల్ని ఆయన తీసుకుంటున్నారు. అందులో భాగంగానే పోప్‌నకు పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం. కాగా.. ప్రపంచ సుస్థిరత, శాంతికి అద్భుతమైన కృషి చేసినవారికి అమెరికా మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ప్రకటిస్తుంటుంది.