News January 7, 2025
సంక్రాంతికి మరో 4 స్పెషల్ రైళ్లు
సంక్రాంతి రద్దీ దృష్ట్యా SCR మరో 4 స్పెషల్ రైళ్లను ప్రకటించింది. కాకినాడ టౌన్-వికారాబాద్, వికారాబాద్-శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్-చర్లపల్లి, చర్లపల్లి-కాకినాడ టౌన్ మధ్య ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. చర్లపల్లి-కాకినాడ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ మీదుగా, మిగతా రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా నడవనున్నాయి.
Similar News
News January 9, 2025
ఏంటి సార్.. మీ కోసం రోజుకు 12 గంటలు పనిచేయాలా?
వారానికి 70 గంటలు వర్క్ చేయాలని నారాయణమూర్తి, 90 గంటలు పనిలో ఉండాలని సుబ్రహ్మణ్యన్(L&T ఛైర్మన్) సలహా ఇస్తున్నారు. వీరి వ్యాఖ్యలపై సగటు వేతన జీవులు ఫైరవుతున్నారు. దీనివల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా సాధ్యమని, ఆఫీసులోనే సగం రోజు గడిపేస్తే భార్య, పిల్లలకు టైమ్ కేటాయించడమెలా అని నిలదీస్తున్నారు. కంపెనీ ఎదుగుదల కోసం వారు చెప్పినట్లే 90 గంటలు వర్క్ చేసినా శాలరీ హైక్స్ మాత్రం ఉండవంటున్నారు. మీరేమంటారు?
News January 9, 2025
తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్
AP: తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి తొక్కిసలాట జరిగిన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.
News January 9, 2025
తొక్కిసలాట ఘటనపై సమీక్షిస్తున్నా: సీఎం చంద్రబాబు
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘స్విమ్స్‌లో బాధితులను పరామర్శించాను. వారందరితో మాట్లాడాను. ఘటనపై సమీక్షిస్తున్నా. అసలేం జరిగిందన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఆ తర్వాత మీడియా ద్వారా పూర్తి వివరాలు ప్రజలకు తెలియచేస్తాను’ అని తెలిపారు. ఘటన విషయంలో అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.