News January 7, 2025

సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్

image

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఆయన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఈ ఉదయం తోసిపుచ్చడం తెలిసిందే. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ తనపై ACB కేసులు కొట్టివేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. మరోవైపు KTR పిటిషన్ వేస్తే విచారణలో తమ వాదనలూ వినాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే SCలో కేవియట్ వేసింది.

Similar News

News August 28, 2025

2038 నాటికి రెండో అతిపెద్ద ఎకానమీగా భారత్!

image

భారత్ పర్చేసింగ్ పవర్ పారిటీ(PPP) టర్మ్స్ పరంగా 2038 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎకానమీగా ఎదగొచ్చని EY రిపోర్ట్ అంచనా వేసింది. $34.2 ట్రిలియన్ల GDP నమోదు చేయొచ్చని పేర్కొంది. దేశ జనాభా సగటు వయసు 28.8 ఏళ్లు, రెండో అత్యధిక సేవింగ్స్ రేట్, ప్రభుత్వ అప్పులు-GDP రేషియో తగ్గుదల తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది. చైనా 2030కి $42.2 ట్రిలియన్లతో లీడింగ్‌లో ఉన్నా వృద్ధ జనాభా దానికి అడ్డంకి అవుతుందంది.

News August 28, 2025

ఈ ప్రత్యేకమైన గణనాథుడి గురించి తెలుసా?

image

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పాలజ్ గ్రామంలో కర్రతో చేసిన సత్య గణేశుడిని పూజిస్తారు. వినాయక చవితి రోజు ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి 11 రోజులు ఉత్సవాలు చేస్తారు. చివరి రోజు ఊరేగించి, నీళ్లు చల్లి ఆలయంలోని గదిలో భద్రపరుస్తారు. 1948లో పాలజ్‌లో కలరా, ప్లేగు వ్యాధులతో చాలా మంది చనిపోవడంతో కర్ర గణపతిని ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు.

News August 28, 2025

సెలవుపై ముందే నిర్ణయం తీసుకోవచ్చుగా.. నెటిజన్ల సూచన

image

భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని పదికి పైగా జిల్లాలో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కొన్ని జిల్లాల్లో లేటుగా తీసుకున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. చాలాచోట్ల స్కూళ్లకు పిల్లలు, టీచర్లు చేరుకున్నాక సెలవు ప్రకటించడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాతావరణ శాఖ నుంచి సూచనలు తీసుకుని ముందు రోజే సెలవుపై నిర్ణయం తీసుకోవడం అంత కష్టమా అంటున్నారు. దీనిపై మీ కామెంట్?