News January 7, 2025
బెంగళూరు కంటే ముందుగానే అక్కడ hMPV

దేశంలో బెంగళూరు కంటే ముందే మరో ప్రాంతంలో hMPV కేసులు వెలుగుచూశాయి. కర్ణాటకలోని షిమోగాలోని ప్రైవేటు ఆసుపత్రిలో 6 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే గత నవంబర్‌లోనే వీటిని గుర్తించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వైరస్ సోకిన వారు 1-2 ఏళ్ల పిల్లలే కాగా ప్రస్తుతం వీరు కోలుకున్నట్లు సమాచారం. మరోవైపు నిన్న, ఇవాళ దేశంలో 8 కొత్త కేసులు వెలుగు చూశాయి.
Similar News
News October 19, 2025
RTCలో డ్రైవర్, శ్రామిక్ పోస్టులు.. 9 రోజులే ఛాన్స్

TGSRTCలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు 22-35 ఏళ్లు, శ్రామిక్ పోస్టులకు 18-30 ఏళ్ల వయసు ఉండాలి. SC, ST, BC, EWS కేటగిరీలకు 5 ఏళ్ల మినహాయింపు ఉంది. డ్రైవర్ పోస్టులకు పదో తరగతి పాసై ఉండాలి. హెవీ గూడ్స్ వెహికల్ లేదా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. సైట్: <
News October 19, 2025
దీపావళి: దీపారాధనకు పాత ప్రమిదలను వాడొచ్చా?

పాత(లేదా) గతేడాది వాడిన మట్టి ప్రమిదలను ఈసారి కూడా వెలిగించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ‘ప్రమిదలు దైవిక శక్తులతో పాటు ప్రతికూల శక్తులను కూడా గ్రహిస్తాయి. వాటిని తిరిగి వాడితే అది మన అదృష్టాన్ని, సంపదను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీపావళి రోజున కొత్త ప్రమిదలను వాడటమే శ్రేయస్కరం. పాత ప్రమిదలను తులసి కోటళ్లో, గౌరవంగా పవిత్ర నదుల్లో, పవిత్ర చెట్ల మొదళ్లలో ఉంచడం మంచిది.
News October 19, 2025
వీధి వ్యాపారులతో ముచ్చటించిన సీఎం

AP: సీఎం చంద్రబాబు విజయవాడ బీసెంట్ రోడ్‌లో పర్యటించారు. పలువురు చిరు, వీధి వ్యాపారులు, జనరల్ స్టోర్, చెప్పుల షాపు నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీ 2.0తో ధరల తగ్గింపు గురించి ఆయా వర్గాల వారిని అడిగి తెలుసుకున్నారు. వ్యాపారుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు యజమానులు, సామాన్య ప్రజలతో ముచ్చటించారు.