News January 7, 2025
సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. జనవరి 11 నుంచి 16 వరకు వరుసగా 6 రోజులు హాలిడేస్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు రాష్ట్రంలోని స్కూళ్లకు ఈ నెల 11 నుంచి 17 వరకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. అటు ఏపీలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.
Similar News
News January 1, 2026
డిసెంబర్ GST వసూళ్లు ₹1.75 లక్షల కోట్లు

డిసెంబర్ 2025లో భారత GST వసూళ్లు 6.1% వృద్ధి చెంది ₹1.75 లక్షల కోట్లకు చేరాయి. దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 19.7% పెరగడం దీనికి ప్రధాన కారణం. దేశీయంగా మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా వంటి రాష్ట్రాలు బలమైన వృద్ధిని కనబరచగా.. పంజాబ్, జమ్మూ కశ్మీర్‌లో తగ్గుదల నమోదైంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం వసూళ్లు 8.6% పెరిగి ₹16.50 లక్షల కోట్లకు చేరడం భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని సూచిస్తోంది.
News January 1, 2026
జీడిమామిడి పూత, పిందె దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రస్తుతం చాలా జీడిమామిడి తోటల్లో పూత, పిందెలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో జీడిమామిడి పంటను టీ దోమ ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు మొదటి దఫాలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ml కలిపి పిచికారీ చేయాలి. దీంతో పాటు ఈ సమయంలో ఆంత్రాక్నోస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాములు లేదా కార్బండిజమ్+ మ్యాంకోజెబ్ 2.5గ్రా కలిపి పిచికారీ చేయాలి.
News January 1, 2026
2026 ఎన్నికల హడావుడి.. ఎవరి కోట కదిలేనో?

2026లో బెంగాల్, TN, కేరళ, అస్సాం అసెంబ్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల హడావుడి ఉండనుంది. WBలో మమతకు BJP పోటీ ఇస్తుంటే.. తమిళనాడులో విజయ్ ఎంట్రీతో లెక్కలు మారాయి. కేరళలో లెఫ్ట్ కోట కదులుతుండగా.. అస్సాంలో కాంగ్రెస్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. APలో పంచాయతీ, TGలో మున్సిపల్ ఎన్నికలు లీడర్లకు అగ్నిపరీక్షగా మారనున్నాయి. దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలూ ఈ ఏడాది హాట్ టాపిక్‌గా కానున్నాయి.


