News January 7, 2025
ప్రధానమంత్రి రోడ్ షోకు ప్రచార రథం సిద్ధం..!
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విశాఖలో నిర్వహించిన రోడ్ షోకు ప్రచార రథాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. వెంకటాద్రి వంటిల్లు ప్రాంతం నుంచి ఏయూ మైదానం వరకు ప్రధాని ఈ రథంపై రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధానంగా మోదీ బొమ్మ మధ్యన ఉంటూ ఇరువైపులా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది
Similar News
News January 9, 2025
వీసీ ఎంపికకు ఏయూ సెర్చ్ కమిటీ
ఏయూ వైస్ ఛాన్సలర్ ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి ఎన్ఐపిఈఆర్ డైరెక్టర్ యుఎస్ఎన్ మూర్తి, ఏయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తరఫున ముంబైలోని ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ ఎస్.మహేంద్ర దేవ్, యూజీసీ నుంచి కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ వీసీ బి.సత్యనారాయణను నియమించింది.
News January 9, 2025
ఉత్తరాంధ్రుల చిరకాల కోరిక తీరనుంది: సీఎం
విశాఖ రైల్వే జోన్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంతో ఉత్తరాంధ్రుల చిరకాల కోరిక తీరనుందని CM చంద్రబాబు పేర్కొన్నారు. రైల్వే జోన్ కోసం 52 ఎకరాలు ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు. మరో వైపు అనకాపల్లి జిల్లాలో రెండు భారీ ప్రాజెక్ట్‌లు వస్తున్నాయని చెప్పారు. అరకు కాఫీని మోదీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసి ఒక బ్రాండ్ తీసుకొచ్చారన్నారు. విశాఖ ఏపీకి ఆర్థిక రాజధానిగా ఎదుగుతుందని CM చెప్పుకొచ్చారు.
News January 8, 2025
విశాఖ హిస్టరీలో మోదీయే తొలి ప్రధాని..!
విశాఖ మహానగరంలో ప్రధాన మంత్రి హోదాలో రోడ్ షో నిర్వహించనున్న మొదటి వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలవనున్నారు. గతంలో ప్రధాని హోదాలో విశాఖ వచ్చిన ఇందిరా గాంధీ, విశ్వనాథ ప్రతాప్‌సింగ్, పీవీ నరసింహారావు బహిరంగ సభలకు మాత్రమే పరిమితమయ్యారు. కాగా మోదీ తొలిసారిగా నగరంలో రోడ్ షో నిర్వహించి ప్రత్యేక గుర్తింపు పొందనున్నారు. దీంతోపాటు రూ.2లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టనున్నారు.