News January 7, 2025

ఫార్ములా ఈ కేసు.. రేపు విచారణకు అరవింద్

image

TG: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో రేపు కీలక పరిణామం జరగనుంది. అరవింద్ కుమార్ రేపు ACB విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో A-2గా ఉన్న ఆయన తన పరిధిలోని HMDA నుంచి FEOకు నిధులు బదిలీ చేశారు. KTR ఆదేశాలతోనే నిధులు బదిలీ చేసినట్లు గతంలో అరవింద్ వివరణ ఇవ్వగా, రేపు ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేయనున్నారు. ఆయన స్టేట్‌మెంట్ ఆధారంగా KTRను ACB తర్వాత విచారించే అవకాశం ఉంది.

Similar News

News January 9, 2025

కోహ్లీకి చెప్పే స్థాయి గంభీర్‌కు లేదేమో: కైఫ్

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెప్పే స్థాయికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంకా చేరుకోలేదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నారు. ‘కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్‌లో మార్పులు తీసుకొచ్చేంత దశకు గౌతీ ఎదగలేదు. ఇది సాధించడానికి ఆయనకు మరికొంత సమయం కావాలేమో. గౌతీ ముందుగా జట్టు కూర్పు గురించి ఆలోచించాలి. గంభీర్ కోచ్‌గా కూడా ఇంకా మరింత ఎదగాల్సి ఉంది’ అని కైఫ్ అభిప్రాయపడ్డారు.

News January 9, 2025

ACB ఆఫీసుకు KTR.. విచారణ ప్రారంభం

image

TG: కేటీఆర్ కొద్దిసేపటి కిందటే బంజారాహిల్స్‌లోని ఏసీబీ ఆఫీసుకు చేరుకున్నారు. కేటీఆర్ లాయర్ రామచందర్‌రావు కూడా కార్యాలయంలోకి వెళ్లగా విచారణ జరిగే గది పక్కనే ఉన్న లైబ్రరీ రూం వరకే ఆయన్ను అనుమతించారు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, క్యాబినెట్ అనుమతి లేకుండా ఒప్పందాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు తదితరాలపై కేటీఆర్‌ను ఏసీబీ ప్రశ్నించనున్నట్లు సమాచారం.

News January 9, 2025

Stock Markets: ఫార్మా, ఫైనాన్స్ షేర్లు డౌన్

image

బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలే అందాయి. Q3 results నిరాశాజనకంగా ఉంటాయన్న అంచనాతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగుతున్నారు. నిఫ్టీ 23,608 (-83), సెన్సెక్స్ 77,902 (-245) వద్ద ట్రేడవుతున్నాయి. fmcg, media షేర్లు జోరు ప్రదర్శిస్తున్నాయి. bank, ఫైనాన్స్, ఫార్మా, రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. కొటక్, hul, bajaj auto, itc టాప్ గెయినర్స్.