News January 7, 2025
పెళ్లిలో మందు, డీజే లేకపోతే రూ.21వేల బహుమతి
వివాహాల్లో మద్యం, డీజే సాధారణంగా మారిపోయాయి. వీటితో ఆనందంతో పాటు అవతలి వారికి అసౌకర్యం కూడా ఉంటుంది. ఈ ఇబ్బందిని తగ్గించేలా పంజాబ్‌లోని బఠిండా జిల్లా బల్లా గ్రామ పెద్దలు వినూత్న ఆఫర్ ప్రకటించారు. మద్యం, డీజే లేకుండా పెళ్లి చేసుకున్న వారికి రూ.21వేలు బహుమతిగా ఇస్తున్నారు. వృథా ఖర్చును తగ్గించేందుకే ఈ పథకం ప్రారంభించినట్లు సర్పంచ్ అమర్‌జిత్ కౌర్ తెలిపారు.
Similar News
News January 9, 2025
డ్రెస్సులపై కామెంట్స్.. హీరోయిన్ ఘాటు రిప్లై
హీరోయిన్ హనీరోజ్‌ను వేధించిన బాబీని పోలీసులు <<15102782>>అరెస్టు చేయగా<<>>, మలయాళ కామెంటేటర్ రాహుల్ ఈశ్వర్ అతనికి మద్దతుగా నిలిచారు. ఆమె ధరించే డ్రెస్సులపై విమర్శిస్తూ ఇలాంటి కామెంట్స్ సమాజంలో సహజమేనన్నారు. దీనిపై హీరోయిన్ ఫైరయ్యారు. ‘మీకు భాషపై పట్టుంది. కానీ మహిళల దుస్తుల విషయంలో మాత్రం కంట్రోల్ తప్పుతున్నారు. ఎలాంటి వస్త్రధారణ మీ స్వీయనియంత్రణకు భంగం కలిగిస్తుందో ఎవరు అంచనా వేయగలరు?’ అని ప్రశ్నించారు.
News January 9, 2025
కాసేపట్లో చంద్రబాబు ప్రెస్‌మీట్
తిరుపతి తొక్కిసలాట ఘటనపై TTD అధికారులతో AP CM చంద్రబాబు సమీక్ష ముగిసింది. దేవస్థాన అధికారుల పనితీరుపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అటు భేటీ వివరాలను కాసేపట్లో ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు వెల్లడించే అవకాశముంది.
News January 9, 2025
Rs.3961CR బకాయిలు: TGపై గ్లోబల్ లిక్కర్ కంపెనీల ఒత్తిడి
బకాయిలు వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వంపై గ్లోబల్ ఆల్కహాల్ కంపెనీలు ఒత్తిడి తెస్తునట్టు తెలిసింది. డియాజియో, పెర్నాడ్ రికార్డ్, కాల్స్‌బర్గ్ వంటి కంపెనీలకు ప్రభుత్వం $466m (Rs.3961CR) బాకీ పడింది. దీంతో ఎన్నడూలేని విధంగా Heineken ఈ వారం ఆల్కహాల్ సరఫరాను సస్పెండ్ చేసినట్టు సమాచారం. రూ.900 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో కింగ్‌ఫిషర్ బీర్లు ఉత్పత్తి చేసే UBL సరఫరాను బంద్ చేయడం తెలిసిందే.