News January 7, 2025

GATE అడ్మిట్ కార్డులు విడుదల

image

GATE అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ నంబర్/ఈ-మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు. ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరిగే ఈ పరీక్షను ఐఐటీ రూర్కీ నిర్వహిస్తోంది. మార్చిలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఐఐటీ మద్రాస్, ఖరగ్‌పూర్ జోన్ల కింద ఏపీ, తెలంగాణలో పరీక్షలు జరుగుతాయి. అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ <>క్లి<<>>క్ చేయండి.

Similar News

News January 9, 2025

కాసేపట్లో చంద్రబాబు ప్రెస్‌మీట్

image

తిరుపతి తొక్కిసలాట ఘటనపై TTD అధికారులతో AP CM చంద్రబాబు సమీక్ష ముగిసింది. దేవస్థాన అధికారుల పనితీరుపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అటు భేటీ వివరాలను కాసేపట్లో ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు వెల్లడించే అవకాశముంది.

News January 9, 2025

Rs.3961CR బకాయిలు: TGపై గ్లోబల్ లిక్కర్ కంపెనీల ఒత్తిడి

image

బకాయిలు వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వంపై గ్లోబల్ ఆల్కహాల్ కంపెనీలు ఒత్తిడి తెస్తునట్టు తెలిసింది. డియాజియో, పెర్నాడ్ రికార్డ్, కాల్స్‌బర్గ్ వంటి కంపెనీలకు ప్రభుత్వం $466m (Rs.3961CR) బాకీ పడింది. దీంతో ఎన్నడూలేని విధంగా Heineken ఈ వారం ఆల్కహాల్ సరఫరాను సస్పెండ్ చేసినట్టు సమాచారం. రూ.900 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో కింగ్‌ఫిషర్ బీర్లు ఉత్పత్తి చేసే UBL సరఫరాను బంద్ చేయడం తెలిసిందే.

News January 9, 2025

రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కలెక్టర్లతో భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి తర్వాత పలు పథకాలను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు విషయంలో ఆయన వారితో చర్చించనున్నట్లు తెలుస్తోంది.