News January 7, 2025

ఎస్సీ కులగణ‌నపై 12వ తేదీ వరకు అభ్యంతరాల‌ స్వీకరణ: కలెక్టర్

image

ఎస్సీ కుల‌గ‌ణ‌నపై నిర్వహిస్తున్న అభ్యంత‌రాల (ఆడిట్ ప్ర‌క్రియ) స్వీక‌ర‌ణ‌ గ‌డువును జ‌న‌వ‌రి 12వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు అనంతపురం కలెక్టర్ డా.వినోద్ కుమార్ తెలిపారు. జనవరి 7వ తేదీతో గ‌డువు ముగియనుండ‌టంతో మ‌రో 5 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు అందించిందన్నారు. ఎస్‌వోపీ విధివిధానాలు తెలుపుతూ ప్రభుత్వం 265 నంబరు జీవో విడుదల చేసినట్లు తెలిపారు.

Similar News

News March 16, 2026

నేటి నుంచి పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

image

జాతీయ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నేటి నుంచి ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుందని పశుసంవర్థక శాఖ జేడీ ప్రేమ్‌చంద్ తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పశువులకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాకు 3.20 లక్షల మందు డోసులు సరఫరా అయ్యాయని, ప్రతి గ్రామంలోని పశువులకు ముందస్తుగా టీకాలు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News March 16, 2026

వైభవంగా ముగిసిన గుత్తి కోట ఉత్సవాలు

image

జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గుత్తి కోట ఉత్సవాలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. స్థానిక ఫుట్‌బాల్ క్రీడా ప్రాంగణంలో జరిగిన ఈ ముగింపు వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, దగ్గుపాటి వెంకటప్రసాద్ పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ చాటిన కళాకారులకు వీరి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఉత్సవాలు విజయవంతం కావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

News March 15, 2026

ATP: ఈనెల 16న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

image

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఈనెల 16న జిల్లా వ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రధాన కార్యక్రమం జరగనుంది. నియోజకవర్గ విజన్ యూనిట్లలో విజయవాడలో నిర్వహించే 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.