News March 17, 2024

HYD: ప్రధాని పర్యటన.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు

image

HYD నగరంలో ఈ నెల 17, 18న ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర అదనపు పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. PM ఈ నెల 17న బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్ వెళ్లనున్న నేపథ్యంలో రాత్రి 7.40 నుంచి 8.10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 18న PM రాజ్‌భవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు. దీంతో ఉదయం 9.50 నుంచి 10.20 గంటలకు వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.

Similar News

News September 3, 2025

HYD నలు దిక్కుల అభివృద్ధికి రంగం సిద్ధం..!

image

HYD నలు దిక్కుల అభివృద్ధి కోసం 30 వేల ఎకరాల భూమి అవసరమని HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలియజేశారు. 350 కిలోమీటర్ల RRR పనులు త్వరలో ప్రారంభమవుతాయని, మాస్టర్‌ప్లాన్ 2050 సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. HYD విస్తరణలో భాగంగా మొదటి దశలో 1000 ఎకరాలు అవసరమని దీనికి సంబంధించి భూసేకరణపై ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైనట్లు వెల్లడించారు.

News September 3, 2025

HYD: 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. యువకుడికి జీవిత ఖైదు

image

HYD కాప్రా మండలం జవహర్‌నగర్ PS పరిధిలో 2021లో 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన అభిరామ్ దాస్‌కు కోర్టు జీవిత ఖైదు, రూ.60 వేలు జరిమానా విధించిందని పోలీసులు ఈరోజు తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించిందన్నారు. కాగా 363, 366, 376(AB), 376(2)(m), 377 ఐపీసీ& పోక్సో Act కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కూలీ పని చేసే అభిరామ్ ఒడిశా రాష్ట్రానికి చెందినవాడు.

News September 3, 2025

HYD: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని సీఎంకు లేఖలు

image

డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డికి ఈరోజు HYDలో పోస్ట్ కార్డ్స్ రాశారు. టీచర్స్ ప్రమోషన్స్ ద్వారా ఏర్పడిన ఖాళీలతోపాటు పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. గత డీఎస్సీ తర్వాత ఇప్పటికే రెండు సార్లు టెట్ పరీక్షలు నిర్వహించారని, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని సీఎంను కోరారు.