News January 7, 2025

SKLM: ఎస్సీ కులగణ‌నపై 12వ తేదీ వరకు అభ్యంతరాల‌ స్వీకరణ

image

ఎస్సీ కుల‌గ‌ణ‌నపై నిర్వహిస్తున్న అభ్యంత‌రాల (ఆడిట్ ప్ర‌క్రియ) స్వీక‌ర‌ణ‌ గ‌డువును జ‌న‌వ‌రి 12వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి 7వ తేదీతో గ‌డువు ముగియనుండ‌టంతో మ‌రొక 5 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్ర‌త్యేక ఉత్త‌ర్వులు జారీ చేసింద‌ని కలెక్టర్ చెప్పారు. ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News January 9, 2025

రేపు ప్రభుత్వ కార్యాలయాలలో ప్లాంటేషన్ ప్రారంభం

image

ఉపాధి హామీ పథకంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. బుధవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కేంద్రమంత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో 315 ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించామని వివరించారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు.

News January 9, 2025

ఇచ్ఛాపురం: ప్రజా సంకల్ప యాత్రకు 6 ఏళ్లు

image

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు నేటితో 6 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ పాదయాత్ర 2017 నవంబర్ 6 నుంచి 341 రోజుల పాటు సాగింది. 2019 జనవరి 9లో ముగిసింది. ఈ పాదయాత్ర 2019 ఏపీ శాసనసభ ఎన్నికల ముందు ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగింపునకు గుర్తుగా వైసీపీ శ్రేణులు ఒక స్తూపం నిర్మించారు. గురువారం ఇచ్ఛాపురం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్తూపం వద్ద సమావేశం ఏర్పాటు చేశారు.

News January 9, 2025

తిరుపతి ఘటనపై అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి

image

తిరుపతిలో బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులు మృతి కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఘటన దురదృష్టకరమన్నారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.