News January 7, 2025
టైమ్ స్లాట్ ప్రకారమే వైకుంఠ ద్వార దర్శనాలు: టీటీడీ ఈవో

AP: తిరుమలలో 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ నెల 10 నుంచి పది రోజుల్లో 7.5 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 3వేల మంది పోలీసులు, 1500 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తామని తెలిపారు. టైమ్ స్లాట్ ప్రకారమే వైకుంఠద్వార దర్శనాలకు రావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజుల్లో వీఐపీలు స్వయంగా వస్తే దర్శనం కల్పిస్తామని చెప్పారు.
Similar News
News August 27, 2025
ఈ జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవు

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు ఉండనుంది. మిగతా జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. మీ జిల్లాలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.
News August 27, 2025
గోదావరి పరీవాహక ప్రజలు జాగ్రత్త!

TG: గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లాలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అది 4 లక్షల నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందన్నారు. మంజీరా నది వరద అంతా SRSPలోకి రానుంది. అటు కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం ప్రవాహం పెరగనుంది.
News August 27, 2025
అర్హులెవరికీ అన్యాయం జరగదు: చంద్రబాబు

AP: అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని పార్టీ యంత్రాంగానికి CM చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్య నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘రూ.500ల దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలు చేశాం. మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు ఇస్తున్నాం. ప్రజలకు ఎంతో చేస్తున్నాం. చేసింది చెప్పుకుందాం. జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం. రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు చేస్తున్నాం’ అని తెలిపారు.