News January 7, 2025

వైఎస్ జగన్‌కు హైకోర్టులో ఊరట

image

AP: మాజీ CM YS జగన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఐదేళ్ల గడువుతో ఆయనకు పాస్‌పోర్టు మంజూరు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబరు 20న జగన్ పాస్‌పోర్టు గడువు ముగిసింది. తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టుకు NOC ఇచ్చేలా ఆదేశించాలన్న ఆయన విజ్ఞప్తిని ప్రజాప్రతినిధుల కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పు వెలువడింది.

Similar News

News October 18, 2025

నేడు గ్రూప్-2 నియామక పత్రాల పంపిణీ

image

TG: గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో 783 మంది అభ్యర్థులు నియామక పత్రాలు అందుకోనున్నారు. విభాగాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల్లో వీరిని నియమించేలా ఏర్పాట్లు చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

News October 18, 2025

K-Ramp పబ్లిక్ టాక్

image

కిరణ్ అబ్బవరం-డెబ్యూ డైరెక్టర్ జైన్స్ నాని కాంబోలో తెరకెక్కిన K-Ramp చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే USలో ప్రీమియర్స్ పడ్డాయి. కిరణ్ అబ్బవరం యాక్టింగ్, వన్ లైనర్ పంచ్‌లు అలరించాయని NRI ప్రేక్షకులు చెబుతున్నారు. అయితే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌లా లేదని, డబుల్ మీనింగ్ డోస్ కాస్త తగ్గించి ఉంటే బాగుండేది అంటున్నారు. కాసేపట్లో Way2News రివ్యూ.

News October 18, 2025

ఆభరణాలు పెట్టుకుంటే అలర్జీ వస్తోందా?

image

నగలు పెట్టుకున్నపుడు కొందరికి అలర్జీ వస్తుంటుంది. దీన్ని కాంటాక్ట్ డెర్మటైటిస్‌ అంటారు. ఆర్టిఫిషియల్ ఆభరణాల్లో ఎక్కువగా వాడే నికెల్‌ అనే లోహం వల్ల చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, మంట, పొక్కులు వస్తుంటాయి. వీటిని వేసుకొనేముందు పౌడర్‌/ మాయిశ్చరైజర్‌/ క్యాలమైన్ లోషన్స్‌ రాసుకుంటే మంచిది. లేదంటే స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, టైటానియం, 18 క్యారెట్‌ ఎల్లో గోల్డ్‌, స్టెర్లిన్‌ సిల్వర్‌లను ఎంచుకోవచ్చు.