News January 8, 2025

శుభ ముహూర్తం (08-01-2025)

image

✒ తిథి: శుక్ల నవమి మ.2:18 వరకు ✒ నక్షత్రం: అశ్విని సా.4.44 వరకు ✒ శుభ సమయాలు సా.3.21-4.21 ✒ రాహుకాలం: ప.12.00-1.30 ✒ యమగండం: ఉ.7.30-మ.9.00 ✒ దుర్ముహూర్తం: ఉ.11.36-12.24 ✒ వర్జ్యం: మ.1.01-2.31, రా.1.41-3.11 ✒ అమృత ఘడియలు: ఉ.10.01-11.30.

Similar News

News January 9, 2025

తిరుపతి తొక్కిసలాట: మృతులకు రూ.25 లక్షల పరిహారం

image

తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మంది గాయపడ్డారు.

News January 9, 2025

కేటీఆర్ క్వాష్ పిటిషన్.. తక్షణ విచారణకు SC నో

image

TG: ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 15న విచారిస్తామని తెలిపింది. అత్యవసరంగా తమ పిటిషన్‌ను విచారణ చేయాలని కోరగా కోర్టు అనుమతించలేదు. ఈ నెల 15న లిస్ట్ అయినందున అదే రోజు విచారిస్తామని స్పష్టం చేసింది. కాగా, హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

News January 9, 2025

జగన్ లండన్ టూర్‌కు కోర్టు అనుమతి

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 11 నుంచి 30 వరకు ఆయన యూకేలో పర్యటించేందుకు అనుమతులు జారీ చేసింది. కాగా తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన లండన్ పర్యటనకు అనుమతించాలని జగన్ కోర్టును కోరారు.