News January 8, 2025
చైనా మాంజా వాడకం నిషేధం: నల్గొండ ఎస్పీ

నల్గొండ జిల్లాలో చైనా మాంజా వాడకం నిషేధించామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. చైనా మాంజా చాలా ప్రమాదకరమని ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు. పతంగులకు నైలాన్, సింథటిక్‌తో చేసిన చైనా మాంజా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సరదా కోసం చేసే ఈ పని ప్రాణాల మీదకు తెస్తుందన్నారు.
Similar News
News November 1, 2025
NLG: ఆ ధాన్యాన్ని కొనుగోలు చేశాం: కలెక్టర్

మొంథా తుఫాన్ ప్రభావంతో నల్గొండ జిల్లాలోని 10 మండలాల పరిధిలో కొంతమేరకు తడిసిన వరి ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో సుమారు 4,600 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తడిసినట్లు పేర్కొన్నారు.
News November 1, 2025
మూగజీవాలకు కష్టాలు.. నట్టల మందుల సరఫరా నిలిపివేత

నల్గొండ జిల్లాలో గత రెండేళ్లుగా పశుసంవర్ధక శాఖ మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు సరఫరా చేయకపోవడంతో కాపరులు ప్రైవేటుపై ఆధారపడుతున్నారు. జిల్లాలో సుమారు 12 లక్షల గొర్రెలు, 2 లక్షల మేకలు ఉన్నట్లు అంచనా. స్టాక్ త్వరలో వస్తుందని, అందిన వెంటనే పంపిణీ చేస్తామని ఏడీ రమేష్ బాబు తెలిపారు.
News November 1, 2025
చేప పిల్లల పంపిణీకి ముహూర్తం ఖరారు!

జిల్లాలో చేప పిల్లల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. జిల్లాకు 5.98 కోట్ల చేప పిల్లలు కావాలని మత్స్యశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈనెల రెండో తేదీన నకిరేకల్ పట్టణంలోని పెద్ద చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలో సుమారుగా 60 వేల మంది మత్స్య కార్మికులకు ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా లబ్ధి చేకూరనుంది.


