News March 17, 2024

బొబ్బిలి: పురుగు మందు తాగి ఆత్మహత్య

image

పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బొబ్బిలిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన ఎస్.అనిల్ (30) కొన్నేళ్ల కిందట కొత్తపెంటలో బెల్లం ఆడించే పని కోసం తండ్రితో వచ్చాడు. పని పూర్తి కావడంతో ఇంటికి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారి వద్ద ఉన్న ఆవుని అనిల్ అమ్మేశాడు. తక్కువ ధరకు అమ్మాడని తండ్రి కోప్పడడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. 

Similar News

News April 6, 2025

రామతీర్థంలో నేడు జరిగే కార్యక్రమాలు ఇవే..!

image

ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరొందిన రామ‌తీర్థంలోని శ్రీరామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి యాగశాలలో అగ్ని ప్రతిష్ఠాపనం, గాయత్రీ రామాయణం, అష్టకలస స్నపన మహోత్సవం, ఉదయం 10.30 గంటలకు ముత్యాలు, తలంబ్రాలతో స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. సోమవారం 9 గంటలకు శ్రీ సీతారాముల పట్టాభిషేకాన్ని వైభవంగా నిర్వహిస్తారు.

News April 5, 2025

VZM: యువతిపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి

image

విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని శివరాంలో యువతిపై ఇద్దరు యువకులు మాస్కులు వేసుకొని వచ్చి కత్తితో శనివారం దాడి చేశారు. యువతి గ్రామంలో ఇంటి వద్ద పనులు చేస్తుండగా ఇద్దరు యువకులు కత్తితో పొడిచి పారిపోయారు. గాయపడిన 18 ఏళ్ల యువతిని చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. గరివిడి పోలీసులు విచారణ చేపట్టారు.

News April 5, 2025

VZM: జిల్లాలో మూడు అన్న కాంటీన్లకు రాష్ట్ర స్థాయి ర్యాంక్‌లు

image

రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల నిర్వ‌హించిన క్యూఆర్ కోడ్ ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌లో జిల్లాకు చెందిన మూడు అన్న క్యాంటీన్లు మెరుగైన ర్యాంకుల‌ను సాధించాయి. బొబ్బిలి ఆర్అండ్‌బీ ఆఫీసు స‌మీపంలోని అన్న క్యాంటీన్‌కు రాష్ట్ర‌ స్థాయిలో ఐదో స్థానం, విజ‌య‌న‌గ‌రం ప్ర‌కాశం పార్కులోని క్యాంటీన్‌కు ఏడో స్థానం, ఘోషా ఆసుప‌త్రిలోని అన్న క్యాంటిన్‌కు ప‌దో స్థానం ద‌క్కాయని కలెక్టర్ అంబేడ్కర్ శుక్రవారం తెలిపారు.

error: Content is protected !!