News January 8, 2025

షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్.. పాస్‌పోర్ట్ రద్దు

image

మాజీ PM షేక్ హసీనా పాస్‌పోర్టును బంగ్లా ప్రభుత్వం రద్దు చేసింది. రిజర్వేషన్లపై చెలరేగిన అల్లర్ల సమయంలో కిడ్నాప్‌లు, హత్యలకు పాల్పడ్డారంటూ ఆమెతోపాటు మరో 11 మందికి ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. FEB 12లోగా అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఆమె పాస్‌పోర్ట్‌ను రద్దు చేసింది. బంగ్లాలో అల్లర్ల సమయంలో పారిపోయిన వచ్చిన హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నారు.

Similar News

News January 9, 2025

వెంటిలేటర్‌పై ఎవరూ లేరు: సత్యకుమార్

image

AP: తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గాయపడినవారి పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందన్నారు. ఎవరూ కూడా వెంటిలేటర్‌పై లేరన్నారు. తొక్కిసలాటకు కారణాలు దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. బాధితుల ఆవేదనను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఇంకా 29 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు.

News January 9, 2025

మావోయిస్టులపై మరోసారి పోలీస్ పంజా

image

ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు నక్సల్స్ మృతిచెందారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

News January 9, 2025

సోషల్ మీడియాలో మరో హీరోయిన్‌కు వేధింపులు

image

సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తనను చంపుతానంటూ బెదిరిస్తున్నాడని హీరోయిన్ నిధి అగర్వాల్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతోపాటు తన కుటుంబాన్ని కూడా అంతమొందిస్తానని అతడు హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్యా బెదిరింపుల వల్ల తాను తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు ఆమె వాపోయారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల హీరోయిన్ హనీ రోజ్‌ను కూడా ఓ వ్యాపారవేత్త వేధించిన విషయం తెలిసిందే.