News March 17, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

*వివిధ శాఖలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
*ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
*ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
*అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే పర్యటన
*బయ్యారం మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
*కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
*పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
Similar News
News August 17, 2025
ఖమ్మం జిల్లాలో 24 గంటల్లో 15.6 మి.మీ. వర్షపాతం

ఖమ్మం జిల్లాలో గత 24 గంటల్లో 15.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8.30 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. తల్లాడలో అత్యధికంగా 6.2 మి.మీ., నెలకొండపల్లిలో 3.6, సింగరేణిలో 2.6, వైరాలో 1.2, కామేపల్లిలో 1.0, ఎన్కూరులో 0.8 మి.మీ. వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని, జిల్లా సగటు వర్షపాతం 0.7 మి.మీ.గా ఉందని అధికారులు పేర్కొన్నారు
News August 17, 2025
ఖమ్మం: తగ్గుముఖం పట్టిన మున్నేరు

మున్నేరుకు వరద ఆదివారం ఉదయం తగ్గుముఖం పట్టింది. ఉదయం 7 గంటలకు నీటిమట్టం 13 అడుగులకు తగ్గింది. శనివారం రాత్రి గంట గంటకూ పెరుగుతూ 15 అడుగుల వరకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద తగ్గుముఖం పట్టడంతో మొదటి ప్రమాద హెచ్చరిక అవసరం లేకుండా పోయింది. ఈ పరిస్థితిని జిల్లా కలెక్టర్ అనుదీప్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఇతర రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమీక్షించారు.
News August 17, 2025
ఖమ్మంలో రెండు రోజులు పూల వ్యాపారం బంద్

ఖమ్మంలో ఈ నెల 18, 19 తేదీలలో పూల వ్యాపారం పూర్తిగా నిలిచిపోనుంది. ప్రతిరోజు వ్యాపారం చేసే వ్యాపారుల ప్రయోజనాలను కాపాడటానికి, పండుగల సమయంలో కొత్తగా వ్యాపారం చేసే వారికి ఎవరూ సహకరించవద్దని నగర పూల వ్యాపారస్తుల సంఘం నిర్ణయం తీసుకుంది. పాతవ్యాపారస్తులందరూ భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని సంఘం పిలుపునిచ్చింది. బంద్కు సహకరించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.