News January 8, 2025
26న ట్రాక్టర్ మార్చ్‌కి రైతుల పిలుపు
పంజాబ్-హరియాణా సరిహద్దుల్లో నిరసన చేపట్టిన రైతులు ఈనెల 26న దేశవ్యాప్త ట్రాక్టర్ మార్చ్‌కి పిలుపునిచ్చారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ సహా ఇతర డిమాండ్ల సాధనకు రైతులంతా మార్చ్‌లో పాల్గొనాలని కోరారు. కాగా రైతునేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ సరిహద్దులో తన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. కేంద్రం దిగొచ్చేవరకు దీక్ష విరమించబోనని స్పష్టం చేశారు. ఆయనకు మద్దతుగా వేలాదిమంది రైతులు ఆందోళన చేస్తున్నారు.
Similar News
News January 9, 2025
ట్రూడోకు షాక్: నిజ్జర్ హత్య కేసులో నలుగురు భారతీయులకు బెయిల్
పదవి నుంచి దిగిపోతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు మరో షాక్! ఖలిస్థానీ టెర్రరిస్టు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో అభియోగాలు మోపిన నలుగురు భారతీయులకు కెనడాలోని ఓ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణను బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టుకు బదిలీ చేసింది. అమిత్ షా, అజిత్ ధోవల్, జైశంకర్ ఈ హత్యకు ప్లాన్ చేశారంటూ ట్రూడో ప్రభుత్వం భారత వ్యతిరేక నెరేటివ్ బిల్డ్ చేసిన సంగతి తెలిసిందే.
News January 9, 2025
పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి
HYD మార్కెట్లో 3 రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు కాస్త పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 పెరిగి రూ.79,200గా ఉంది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.350 ఎగసి రూ.7,2600కు చేరింది. అటు వెండి ధరలు 2 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.లక్షగా ఉంది.
News January 9, 2025
మోదీ అన్నట్టే ‘ఇండీ ఘట్బంధన్’ కకావికలు!
ఆర్నెల్లలో ‘ఇండీ ఘట్బంధన్’ కకావికలం అవుతుందన్న PM మోదీ మాటలు నిజమయ్యేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులంటున్నారు. HAR, MHలో కాంగ్రెస్ ఓటములు, JK, JHAలో ప్రభావశూన్యతే ఇందుకు కారణమంటున్నారు. అదానీ అంశంలో SP, TMC మద్దతివ్వకపోవడం, DMK TNకే పరిమితం అవ్వడం, మహారాష్ట్రలో విడిపోయిన పార్టీలు ఏకమయ్యే పరిస్థితి, INDIA లోక్‌సభ వరకేనన్న RJD, ఢిల్లీ ఎన్నికల్లో INCని కాదని AAPకు మద్దతును ఉదాహరణగా చూపిస్తున్నారు.