News January 8, 2025
చనిపోయిన జవాన్లలో ఐదుగురు మాజీ మావోలు
ఛత్తీస్గఢ్ బీజాపూర్లో సోమవారం మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో 8 మంది జవాన్లు చనిపోయిన <<15079768>>విషయం<<>> తెలిసిందే. అయితే వీరిలో ఐదుగురు మాజీ మావోయిస్టులని పోలీసులు తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసిన మావోలను డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్లుగా పోలీసు శాఖ నియమించుకుంటుంది. అలా చేరిన బయన్ సోధీ, పండరురామ్ పొయం, డుమ్మా మార్కం, బుద్రామ్ కొర్పా, సోమడు వెట్టి ఈ ఘటనలో చనిపోయారు.
Similar News
News January 9, 2025
అధికారుల సేవ TTD కంటే TDPకే ఎక్కువ: అంబటి
AP: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తిరుపతిలో ఘోరం జరిగిందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ‘అధికారులు టీటీడీ కంటే టీడీపీకే ఎక్కువ సేవ చేస్తున్నారు. ఆఫీసర్లపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి ఏం సాధించారు? అధికారులను తిడితే సమస్యలు పరిష్కారమవుతాయా? ఇదే నిర్లక్ష్యం కొనసాగితే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇవ్వాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
News January 9, 2025
గతంలోలాగే ఏర్పాట్లు.. ఈవోపై సీఎం ఫైర్
AP: టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో లాగే ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేశామన్న టీటీడీ ఈవో శ్యామల రావు వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘ఎవరో చేశారని నువ్వు అలానే చేస్తావా? నీకంటూ కొత్త ఆలోచనలు లేవా?’ అంటూ ప్రశ్నించారు. సాంకేతికతను ఎందుకు వాడుకోలేదని ఈవోను నిలదీశారు.
News January 9, 2025
ట్రెండింగ్లో ‘లొట్టపీసు’.. అర్థం ఏంటంటే?
తనపై పెట్టిన కేసు ‘లొట్టపీసు’ అని KTR వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘లొట్టపీసు’ ట్రెండింగ్లోకి వచ్చింది. దీని అర్థం కోసం చాలామంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. కాగా, లొట్టపీసు అనేది కాలువలు, కుంటలు, చెరువుల్లో పెరిగే ఓ మొక్క. దీని కాండం తెల్లని పూతతో లొట్ట(లోపల ఖాళీగా, డొల్ల) మాదిరి ఉంటుంది. అందుకే దీనికి ‘లొట్టపీసు’ పేరు వచ్చింది. గ్రామీణ నేపథ్యమున్న వారికి ఇది సుపరిచితమైన పేరే.