News January 8, 2025
టెక్కలి: టీడీపీ నేతలపై కేసు కొట్టివేత

టెక్కలి మండల టీడీపీ అధ్యక్షుడు బగాది శేషగిరిరావుతో పాటు 13 మందిపై 2022 ఫిబ్రవరిలో నమోదైన కేసు కొట్టివేస్తూ మంగళవారం టెక్కలి జూనియర్ సివిల్ జడ్జి SHR తేజాచక్రవర్తి తీర్పు వెల్లడించారు. 2022లో టీడీపీ నేతలు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన క్రమంలో అప్పటి టెక్కలి మండల పరిషత్ అధికారి విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు. ఆధారాలు లేనందున కేసును కొట్టివేసినట్లు న్యాయవాది ప్రభుచంద్ తెలిపారు.
Similar News
News February 26, 2026
శ్రీకాకుళం: గూడ్స్ రైలు నుంచి విడిపోయిన బోగీలు

మందస మండలం మకరజోల వద్ద విశాఖ నుంచి కోల్‌కతా వైపునకు వెళ్తున్న గూడ్స్ రైలు ఆరు బోగీలు విడిపోయాయి. మిగిలిన బోగీలతో 100 మీటర్లు ముందుకు వెళ్లి నిలిపివేశారు. దీంతో మకరజోల మీదుగా ఉద్దానం గ్రామాలకు వెళ్లే రహదారిపై రైలు క్రాసింగ్ వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు గంటపాటు ఇబ్బందులు పడ్డారు.
News February 26, 2026
శ్రీకాకుళం జిల్లాకు కొత్త ఆఫీసర్

శ్రీకాకుళం జిల్లా పంచాయతీ అధికారిగా కె. గోపి బాలను ప్రభుత్వం నియమించింది. బుధవారం రాత్రి ప్రస్తుతం డీపీవోగా పనిచేస్తున్న భారతి సౌజన్యను బదిలీ చేశారు. గోపి బాల శ్రీకాకుళం డివిజనల్ పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తుండగా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం.
News February 26, 2026
డయేరియా.. శ్రీకాకుళానికి రూ.118 కోట్లు

శ్రీకాకుళం నగరంలో తాగునీరు, డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి పనుల కోసం రూ.118 కోట్లు కేటాయిస్తున్నామని మంత్రి నారాయణ బుధవారం వెల్లడించారు. దమ్మలవీధి, మొండేటి వీధి, కండ్రవీధి, ఎచ్చెర్ల వీధి ప్రాంతాల్లో ప్రబలిన డయేరియా అదుపులోకి వచ్చిందన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి బాధిత ప్రాంతాల్లో పర్యటించారు.


