News January 8, 2025
ఎల్లుండి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
TG: పెండింగ్ బకాయిలు చెల్లించకుంటే ఈనెల 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి ప్రైవేటు ఆసుపత్రులు తేల్చి చెప్పాయి. ఏడాదిగా ఆరోగ్యశ్రీ, EHS, JHS కింద రూ.1000Cr పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నాయి. దీంతో ఆసుపత్రులు నడిపే పరిస్థితులు లేకుండాపోయాయని వెల్లడించాయి. కాగా ఏడాదిలో రూ.920Cr బిల్లులు చెల్లించామని, మరో రూ.450-500 కోట్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Similar News
News January 9, 2025
బుమ్రా బంగారు బాతు.. చంపేయొద్దు: కైఫ్
భారత క్రికెట్‌కు బుమ్రా బంగారు బాతు వంటి ఆటగాడని, ఆ బాతును ఎక్కువగా వాడి చంపేయకూడదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సూచించారు. ‘బుమ్రాను కెప్టెన్‌గా నియమించే ముందు బీసీసీఐ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. కెప్టెన్సీ భారాన్ని వేరేవారికి వదిలేసి బుమ్రా కేవలం వికెట్లు తీయడంపై దృష్టి సారించేలా చూడాలి. లేదంటే ఆ ఒత్తిడి అతడికి కొత్త గాయాలను తీసుకొచ్చి మొదటికే మోసం రావొచ్చు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
News January 9, 2025
పిల్లలకు జన్మనిస్తే రూ.81,000.. యువతులకు ఆఫర్
రష్యాలో గత ఏడాది జననాలు తగ్గడంతో ఆ దేశంలోని కరేలియా యంత్రాంగం సంచలన ప్రకటన చేసింది. 25 ఏళ్ల లోపు యువతులు ఆరోగ్యకరమైన చిన్నారులకు జన్మనిస్తే రూ.81,000 ఇస్తామని ప్రకటించింది. కరేలియాకు చెందిన వారై స్థానికంగా చదివేవారిని అర్హులుగా పేర్కొంది. అయితే ఇప్పటికే పిల్లలున్న వారికి ఇది వర్తించదని తెలిపింది. ఇతర ప్రాంతాలు ఇదే విధానాన్ని అనుసరించే యోచనలో ఉన్నాయి.
News January 9, 2025
అధికారుల సేవ TTD కంటే TDPకే ఎక్కువ: అంబటి
AP: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తిరుపతిలో ఘోరం జరిగిందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ‘అధికారులు టీటీడీ కంటే టీడీపీకే ఎక్కువ సేవ చేస్తున్నారు. ఆఫీసర్లపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి ఏం సాధించారు? అధికారులను తిడితే సమస్యలు పరిష్కారమవుతాయా? ఇదే నిర్లక్ష్యం కొనసాగితే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇవ్వాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.