News March 17, 2024
జగన్పై మోదీ విమర్శలు చేస్తారా?
AP: అధికారం చేపట్టిన నాటి నుంచి CM జగన్.. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తూ వస్తున్నారు. దీంతో మోదీ, జగన్ ఎప్పుడూ విమర్శలు చేసుకోలేదు. కానీ ఇటీవల బీజేపీ.. టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఈక్రమంలోనే ఇవాళ చిలకలూరిపేటలో మూడు పార్టీల సంయుక్త సభ జరగనుంది. దీనికి మోదీ హాజరుకానున్నారు. మరి ఈ సభలో తొలిసారి ఆయన జగన్పై విమర్శలు చేస్తారా? చేస్తే దేని గురించి మాట్లాడతారు? అనేది ఆసక్తిగా మారింది.
Similar News
News December 23, 2024
జో రూట్ ఎంట్రీ.. బెన్ స్టోక్స్ ఎగ్జిట్
భారత్తో వన్డే సిరీస్ కోసం నిన్న ఇంగ్లండ్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్తో జో రూట్ 2023 తర్వాత భారత్పై తిరిగి ఎంట్రీ ఇస్తున్నారు. మరోవైపు స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ తొడకండరాల గాయం కారణంగా ఎంపిక కాలేదు. తొలి వన్డే ఫిబ్రవరి 6, రెండోది 9, మూడో వన్డే 12న జరగనున్నాయి. 5మ్యాచుల టీ20 సిరీస్ JAN 22- FEB 2 వరకు జరుగుతుంది. ఈ సిరీస్లకు జోస్ బట్లర్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు.
News December 23, 2024
40 లక్షల మందికి రైతు భరోసా కట్!: BRS
TG: రైతు భరోసా పథకానికి పీఎం కిసాన్ నిబంధనలను వర్తింపజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలిచ్చిందని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ఒకవేళ ఈ నిబంధనలే అమలు చేస్తే దాదాపు 40 లక్షల మంది రైతులకు రైతు భరోసా కట్ అవుతుందని పేర్కొంది. తమ హయాంలో 70 లక్షల మందికి రైతు బంధు ఇచ్చామని, రైతు బంధు కంటే పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య 40 లక్షలు తక్కువని తెలిపింది.
News December 23, 2024
రాష్ట్రంలో మరిన్ని సంతాన సాఫల్య కేంద్రాలు
TG: సంతాన లేమి సమస్యతో బాధపడుతున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే HYDలోని గాంధీ, పేట్ల బురుజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐవీఎఫ్ కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం మరిన్ని జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. వరంగల్ ఎంజీఎంలో ఏర్పాటుకు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. HYD, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, MBNRలోనూ ఏర్పాటు చేయనుంది.