News January 8, 2025

మహబూబ్‌నగర్‌లో తాత్కాలికంగా పలు రైళ్ల రద్దు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో రైల్వే పనుల మరమ్మతుల కారణంగా పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లా మీదుగా సికింద్రాబాద్ – కర్నూల్ సిటీ తుంగభద్ర రైలు కర్నూలు – గద్వాల మధ్య పట్టాల మరమ్మతుల కారణంగా ఈ రైలు గద్వాల వరకు మాత్రమే నడవనుంది. కాచిగూడ – MBNR రైలు షాద్‌నగర్ వరకు మాత్రమే నడవనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరుతున్నారు.

Similar News

News March 3, 2026

జడ్చర్ల: కుక్కలు పీక్కుతిన్న మృతదేహం ఇతడిదే!

image

జడ్చర్ల మండలం నాగసాల చెరువులో పడి మృతి చెందిన భీమేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం గది బయట కుక్కలు పీక్కుతిన్న ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై నూతన ప్రభుత్వాసుపత్రిలోని పోస్టుమార్టం గదిలోనే అన్ని పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.

News March 3, 2026

జడ్చర్ల: బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు: అనిరుధ్ రెడ్డి

image

జడ్చర్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న విషయం తెలుసుకున్న MLA అనిరుధ్ రెడ్డి సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో మాట్లాడుతామన్నారు. ఘటనకు బాధ్యులైన సిబ్బంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేయాలని కోరినట్లు తెలిపారు.

News March 2, 2026

MBNR: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

మహబూబ్ నగర్ జిల్లాలో హోలీ పండుగను సహజ రంగులతో ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ డి.జానకి సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, బలవంతంగా రంగులు చల్లడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి చర్యలు చేయరాదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర సమయంలో డయల్- 100 లేదా 8712659360 ను సంప్రదించాలని చెప్పారు. జిల్లా ప్రజలకు ఎస్పీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.