News January 8, 2025
ఖమ్మం: పెళ్లికి ఒప్పుకోలేదని సూసైడ్
పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. SI వివరాల ప్రకారం.. KMM జిల్లా కామేపల్లి మండలం రేపల్లేవాడకు చెందిన నెహ్రూ(23) అదే గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. కాగా, వీరి పెళ్లికి యువతి ఇంట్లో వారు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఈ నెల 3న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. యువకుడి తండ్రి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News January 9, 2025
నైపుణ్యత గల ఉపాధ్యాయులను తయారు చేయాలి: తుమ్మల
ఖమ్మం జిల్లాలోని డైట్ కళాశాల ద్వారా నైపుణ్యత గల ఉపాధ్యాయులను తయారు చేసి సమాజానికి అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం టేకులపల్లిలో పర్యటించి డైట్ అడ్మినిస్ట్రేటివ్ భవన ఆధునీకరణ, అదనపు సదుపాయాల ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. 70 సం.ల్లో అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో విద్యను అభివృద్ధి చేయలేక పోయామని చెప్పారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా కీలకమైందన్నారు.
News January 9, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} పలు శాఖల అధికారులతో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} మధిర నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పినపాక నియోజకవర్గం లో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} కారేపల్లి లో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
News January 9, 2025
KMM: క్వారీ గుంతలో యువకుడి అనుమానాస్పద మృతి
అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఎర్రుపాలెం మండలంలో జరిగింది. నాగవరప్పాడుకు చెందిన రామలింగేశ్వరరావు ములుగుమాడులో ఉన్న క్వారీగుంతలో పడి మృతి చెందాడు. ఈనెల 7న కూలీకి వెళ్లిన రామలింగేశ్వరరావు తిరిగి ఇంటికి రాలేదు. ఆయనకు కొంతకాలంగా మానసిక పరిస్థితి బాగుండకపోవడంతో పాటు ఫిట్స్ ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరోజే గుంతలో పడిఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.