News January 8, 2025

ఉమ్మడి విశాఖలో నేడు ప్రధాని ప్రారంభిచనున్న ప్రాజెక్టులు ఇవే

image

➤ పూడిమడకలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ (రూ.1,85,000 Cr)
➤ నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ (రూ.1,876 Cr)
➤ పాడేరు బైపాస్(రూ.244 Cr)
➤ ద.కో. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం(రూ.149 Cr)
➤ గంగవరం పోర్టు-స్టీల్ ప్లాంట్ 3,4 రైల్వే ట్రాక్ ప్రారంభం(రూ.154 Cr)
➤ దువ్వాడ-సింహాచలం(నార్త్) 3,4 ట్రాక్‌ల నిర్మాణం(రూ.302 Cr)
➤ విశాఖ-గోపాలపట్నం 3,4 ట్రాక్‌ల నిర్మాణం(రూ.159 Cr)
➤ బౌదార-VZM రోడ్డు విస్తరణ(రూ.159 Cr)

Similar News

News November 6, 2025

11వ తేదీ నుంచి డాక్‌యార్డ్ బ్రిడ్జి పై రాకపోకలు: MLA

image

సరిగ్గా 20 నెలల క్రితం మూసివేసిన డాక్ యార్డ్ బ్రిడ్జి పోర్టు యాజమాన్యం సహకారంతో పునర్నిర్మాణం జరిగిందని ఎమ్మెల్యే గణబాబు స్పష్టం చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి రాకపోకలు చేయవచ్చని తెలిపారు. దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో ‌ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనులు పూర్తి చేశారని ఎమ్మెల్యే వెల్లడించారు. అన్ని రహదారుల పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. భద్రత ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

News November 6, 2025

సమన్వయంతో అధికారులు పనులు పూర్తి చేయాలి: మేయర్

image

విశాఖలో ఈనెల 14, 15వ తేదీల్లో భాగస్వామ్య సదస్సు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో నగరమంతా సుందరీకరణ పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశించారు. ఇంజినీరింగ్‌ అధికారులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులు, చేపట్టవలసిన అంశాలు అడిగి తెలుసుకున్నారు.

News November 6, 2025

విశాఖలో ప్రశాంతంగా ముగిసిన కార్తీక పౌర్ణమి వేడుకలు

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా విశాఖ బీచ్‌ల వద్ద వేలాదిమంది భక్తులు సముద్ర స్నానం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డీఐజీ గోపినాథ్‌ ఆధ్వర్యంలో అధికారులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రజల సహకారంతో పాటు రెవెన్యూ, మత్స్య, వైద్య, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు.