News January 8, 2025
విశాఖలో ప్రధాని సభ.. ఫుడ్ పంపిణీకి పక్కా ఏర్పాట్లు
విశాఖలో ప్రధాని మోదీ సభకు వచ్చే ప్రజలకు మధ్యాహ్నం పులిహోరా, మజ్జిగ ప్యాకెట్, వాటర్ బాటిల్ రాత్రికి బిర్యానీ, వాటర్, మజ్జిగ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వనున్నారు. GVMC పరిధిలో వాహనాలు బయలుదేరే చోటే ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయనున్నారు. అనకాపల్లి, విజయనగరం నుంచి వచ్చేవారికి ఆ జిల్లా అధికారులు డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చే వారికి నాతవలస చెక్‌పోస్టు వద్ద ఆహారం అందిస్తారు.
Similar News
News January 9, 2025
పాతపట్నం: లగేజ్ వ్యాన్ ఢీ.. వ్యక్తి మృతి
పాతపట్నం మండలం కొరసవాడ శ్మశాన వాటిక సమీపాన గురువారం మధ్నాహ్నం స్కూటీ- లగేజీ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పాతపట్నం మండలం చాకిపల్లి గ్రామానికి చెందిన మారెడ్ల కృష్ణారావు (53) గా స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
News January 9, 2025
శ్రీకాకుళం: ఇంటికి వెళ్దాం.. పండగ చేద్దాం
సంక్రాంతి సెలవుల నేపధ్యంలో గురువారం శ్రీకాకుళం జిల్లాలో వసతిగృహాల విద్యార్థులు ఇళ్లకు బయలుదేరారు. శుక్రవారం నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో టెక్కలిలో మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, బీసీ, ఎస్సీ, ఎస్టీ బాలురు, బాలికల వసతిగృహ విద్యార్థులు ఇళ్లకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో వసతిగృహాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మళ్లీ పండుగ అనంతరం విద్యార్థులు వసతిగృహాలకు రానున్నారు.
News January 9, 2025
రేపు ప్రభుత్వ కార్యాలయాలలో ప్లాంటేషన్ ప్రారంభం
ఉపాధి హామీ పథకంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. బుధవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కేంద్రమంత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో 315 ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించామని వివరించారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు.