News January 8, 2025

తిరుమల శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేనివారికి వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 62,566 మంది దర్శించుకోగా, 16,021 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.2కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. అటు, తిరుమల నుంచి మహాకుంభమేళా జరుగుతున్న యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు శ్రీవారి రథం బయల్దేరింది.

Similar News

News August 23, 2025

కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ ఇప్పుడే కాదు: రాజీవ్‌ శుక్లా

image

వన్డేల నుంచి టీమ్‌ఇండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకోరని BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. వారిద్దరి రిటైర్మెంట్‌కు అంత తొందర ఏంటని ప్రశ్నించారు. ‘ప్రస్తుతం కోహ్లీ ఎంతో ఫిట్‌గా ఉన్నారు. అలాగే రోహిత్ కూడా బాగా రాణిస్తున్నారు. అలాంటప్పుడు వారు రిటైర్మెంట్ కావాల్సిన అవసరం లేదు. దీనిపై కొందరు లేనిపోని వ్యాఖ్యలు చేయడం దారుణం’ అని ఆయన పేర్కొన్నారు.

News August 23, 2025

వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజులు పెంపు

image

20 ఏళ్లకు పైబడిన పాత వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజును కేంద్రం భారీగా పెంచింది. టూ వీలర్‌కు ₹1000 నుంచి ₹2000కి, త్రీ వీలర్‌కు ₹3,500 నుంచి ₹5,000, లైట్ మోటార్ వెహికల్స్‌కి ₹5000 నుంచి ₹10వేలకు పెంచింది. ఇంపోర్టెడ్ 2, 3 వీలర్స్ ఫీజును ₹10k నుంచి ₹20kకి, ఇంపోర్టెడ్ 4 వీలర్లలకు ₹40k నుంచి ₹80kకి, మిగతా వాహనాలకు ₹6k నుంచి ₹12kకి పెంచినట్లు ప్రకటించింది. 15-20 ఏళ్ల వెహికల్స్‌కు ఎలాంటి పెంపు లేదు.

News August 23, 2025

సుధాకర్ రెడ్డి కళ్లు, భౌతిక కాయం దానం

image

సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి(83) అనారోగ్యంతో <<17489969>>కన్నుమూసిన<<>> సంగతి తెలిసిందే. ఆయన నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి ఇచ్చారు. భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి పరిశోధనల కోసం ఇవ్వనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఆదివారం ఉదయం నుంచి మ.3 గంటల వరకు హిమాయత్‌నగర్‌లోని మగ్దూం భవన్‌లో భౌతిక కాయాన్ని ఉంచి, అనంతరం గాంధీ కాలేజీకి అప్పగిస్తారు. సుధాకర్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.