News March 17, 2024

మెదక్ ఎంపీ స్థానంపై వీడని పీటముడి

image

మెదక్‌ ఎంపీ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిత్వం ఎంపిక విషయంలో పీటముడి వీడటం లేదు. టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆశిస్తున్నారు. మల్కాజ్‌గిరి టికెట్‌పై సైతం ఆశలు పెట్టుకున్నారు. అక్కడ ఇవ్వకుంటే మెదక్‌ టికెట్‌ అయినా ఖరారు చేయాలని ఆయన అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిసింది. పటాన్‌చెరుకు చెందిన నీలం మధు ‌, సంగారెడ్డి DCC అధ్యక్షురాలు, జగ్గారెడ్డి సతీమణి నిర్మల పేర్లు వినిపిస్తున్నాయి.

Similar News

News April 7, 2025

మెదక్: సన్నబియ్యం పంపిణీని వేగవంతం చేయాలి: కలెక్టర్

image

రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం పాపన్నపేట పాతూరులోని పౌర సరఫరాల శాఖ గోదాంలోని నిల్వ ఉన్న బియ్యం నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడీ, హాస్టల్స్‌కు సరఫరా చేసే బియ్యం, రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీకి సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

News April 6, 2025

మెదక్: కోదండ రామాలయంలో కలెక్టర్ పూజలు

image

మెదక్ కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జగదానంద కారకుడు, జగదభిరాముడి జీవితం సమాజానికి ఆదర్శమన్నారు. కోదండ రాముని ఆశీర్వాదంతో జిల్లా ప్రజలు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని కలెక్టర్ కోరుకున్నట్లు వివరించారు. ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనచారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

News April 6, 2025

మెదక్: ఇద్దరు యువకుల గల్లంతు

image

మెదక్ మండలం బాలానగర్ మత్తడిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. తుడుం నవీన్(21), తుడుం అనిల్(22) శనివారం సాయంత్రం స్నానానికి వెళ్లారు. ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెతకగా ఈరోజు ఉదయం చెరువు కట్టపై చెప్పులు, బట్టలు కనిపించాయి. దీంతో యువకుల కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

error: Content is protected !!