News January 8, 2025
KTRలో భయం మొదలైంది: మహేశ్ కుమార్
KTRలో భయం మొదలయ్యిందని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. డిచ్పల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్నటి దాకా దమ్ముంటే అరెస్ట్ చేయండి.. జైలుకు వెళ్తా అని బీరాలు పలికిన KTR ఇప్పుడు విచారణ ఎదుర్కోవడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఏసీబీ కేసు కొట్టివేయాలని KTR హైకోర్టును ఆశ్రయిస్తే పిటిషన్ కొట్టివేయడంతో ఆయనలో భయం మొదలైందన్నారు.
Similar News
News January 9, 2025
NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి పంజా
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మళ్లీ చలి పంజా విసురుతుంది. 2 రోజులుగా నిలకడగా ఉన్న ఉష్ణోగ్రతలు ఈరోజు పడిపోయి చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా డోంగ్లి 7.3, జుక్కల్ 8.1, మేనూర్ 9.0, గాంధారి 9.2 డిగ్రీలు నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా కోటగిరి 10.4, నిజామాబాద్ సౌత్ 10.7, మెండోరా, ధర్పల్లిలో 11.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News January 9, 2025
చైనా మాంజ అమ్మితే చట్ట పరమైన చర్యలు: కామారెడ్డి SP
చైనా మాంజ అమ్మితే చట్ట పరమైన చర్యలు తప్పవని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ హెచ్చరించారు. చైనా మాంజాను నిషేధం విధించినప్పటికీ అక్కడక్కడ అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందన్నారు. దేవునిపల్లి PS పరిధిలో ఒక కేసు నమోదు చేసి 65 బెండ్లల్ల మంజాను స్వాధీనం చేసుకున్నామన్నారు. చైనా మాంజాను ఎవరైనా అమ్మితే 8712686112 కు సమాచారం అందించాలన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
News January 9, 2025
NZB: దారుణం.. వీధి కుక్క నోట శిశువు మృతదేహం
రెంజల్ మండలం బోర్గం గ్రామంలో దారుణ ఘటన ఈరోజు వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. బోర్గం గ్రామంలో రోడ్డుపై ఓ వీధి కుక్క తన నోటితో ఒక మగ శిశువు మృతదేహాన్ని పట్టుకుని పరిగెడుతోంది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే ఆ కుక్కను తరిమికొట్టి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహానికి బొడ్డు తాడు అలాగే ఉండగా పుట్టగానే ఎవరో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.