News January 8, 2025

AMAZING: తాజ్‌మహల్‌లో నల్గొండ రాళ్లు!

image

తాజ్‌మహల్ నిర్మాణంలో NLG జిల్లా దేవరకొండ ప్రాంతంలో లభించే క్రిస్టల్ క్వార్ట్‌జ్ రాళ్లను(పలుగు రాళ్లు) వాడినట్లు తాజాగా వెల్లడైంది. కాలిఫోర్నియాలోని జెమోలాజికల్‌ లైబ్రరీ& రీసెర్చ్‌ సెంటర్‌ నుంచి రిటైర్డ్‌ లైబ్రేరియన్‌ డిర్లామ్, రీసెర్చ్‌ లైబ్రేరియన్‌ రోజర్స్, సంస్థ డైరెక్టర్‌ వెల్డన్‌ కలిసి అధ్యయనం చేపట్టారు. పర్చిన్‌‌కారి పద్ధతిలో ఈ రాళ్లను తాజ్‌మహల్ పాలరాతిలో అంతర్భాగంగా అమర్చినట్లు గుర్తించారు.

Similar News

News January 9, 2025

చౌటుప్పల్: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్

image

చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న భార్యభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు దంపతులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 9, 2025

డిండి: ఆకతాయిలతో కోర్టు ఆవరణం శుభ్రం చేయించారు

image

కందుకూరులో ఇటీవల మద్యం సేవించి ఓ వ్యక్తిపై అకారణంగా దాడికి ప్రయత్నించి అలజడి సృష్టించిన కోక అభిషేక్, జోసెఫ్, శివాజీపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు ఎదుట బుధవారం ప్రవేశపెట్టారు. ముగ్గురు ఆకతాయిలు ఒక్కరోజు శిక్షలో భాగంగా కమ్యూనిటీ సర్వీస్ కింద కోర్టు ఆవరణం శుభ్రం చేయాల్సిందిగా స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ పొట్ట చెన్నయ్య ఆదేశించారని ఎస్సై రాజు అన్నారు. వారితో శిక్షను అమలు చేశామన్నారు.

News January 9, 2025

జిల్లాలో దొంగతనాల నివారణకు ప్రత్యేక బృందాలు: ఎస్పీ

image

నల్గొండ జిల్లాలో దొంగతనాల నివారణకు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. బుధవారం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అనుమానిత వ్యక్తులు కాలనీల్లో తిరిగినట్లు కనిపిస్తే  సమీపంలోని స్టేషన్‌‌కు సమాచారం అందించాలని సూచించారు. అలాగే కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు  చేసుకోవాలన్నారు.