News January 8, 2025
NLG: గురుకులాల్లో అడ్మిషన్లు.. మిస్ చేసుకోకండి

రాష్ట్రంలోని SC, ST, BC, జనరల్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2025-26కి 5వ తరగతి తోపాటు 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 1లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఆసక్తి, అర్హత ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు https://tgcet.cgg.gov.in లో చూడొచ్చు.
Similar News
News February 26, 2026
నల్గొండ: మద్యపాన నిషేధ అమలుకు తీర్మానం

నార్కట్‌పల్లి మండలం షాపల్లి, అమ్మనబోలు గ్రామాలు బెల్ట్ షాపులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. షాపల్లిలో ఈ నెల 26 నుంచి, అమ్మనబోలులో మార్చి 1 నుంచి బెల్టు దుకాణాల నిర్వహణపై కఠిన చర్యలు చేపడతామని పాలకమండలి తీర్మానం చేసింది. గ్రామస్థుల ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇతర పల్లెలు స్వాగతిస్తున్నాయి. ఈ సామాజిక మార్పు ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News February 25, 2026
దేవరకొండ: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన డీసీహెచ్‌ఎస్

జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయకర్త డా.మాతృనాయక్ బుధవారం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రికార్డులు, ల్యాబ్ పరీక్షలను పరిశీలించి, ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్యంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. సూపరింటెండెంట్ డా. రవిప్రకాశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
News February 25, 2026
నల్గొండ: యువతను డ్రగ్స్ నుంచి కాపాడాలి: కలెక్టర్

జిల్లాలో డ్రగ్స్ నివారణకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను పాడుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


