News January 8, 2025

LRS పేరిట డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు: హరీశ్

image

TG: LRSపై త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు. ఫ్రీగా అమలు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ పేరిట డబ్బులు దండుకునేందుకు సిద్ధమవడం సిగ్గుచేటని విమర్శించారు. ‘రియల్ ఎస్టేట్ త్వరలో పుంజుకుంటుందని స్వయంగా రెవెన్యూ మంత్రే అన్నారు. అంటే రియల్ ఎస్టేట్ కుదేలైందనే కదా అర్థం. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏం చెబుతారు?’ అని ప్రశ్నించారు.

Similar News

News August 22, 2025

నేడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ!

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీగా గడపనున్నారు. మ.2 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 3.15 గంటలకు 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ డా.అరవింద్ పనగడియాతో సమావేశమవుతారు. సా.5 గంటలకు వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. ఆ తర్వాత ఆయన కేంద్ర సాంకేతికశాఖ కార్యదర్శి అభయ్ కరందికర్‌ను కలిసి వివిధ ప్రాజెక్టులపై చర్చించనున్నారు.

News August 22, 2025

ఖర్గేను కలిసిన వైసీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి

image

AP: వైసీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఢిల్లీలో కలిశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏకు మద్దతిచ్చిన క్రమంలో ఆయన ఖర్గేను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ఖర్గేతో తనకు ఎప్పటినుంచో పరిచయం ఉందని, అందుకే మర్యాదపూర్వకంగా కలిశానని మేడా స్పష్టం చేశారు. దీనిపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

News August 22, 2025

చిరంజీవికి మెగాస్టార్‌ బిరుదు ఎలా వచ్చిందంటే?

image

1988లో వచ్చిన మరణమృదంగం సినిమా ముందు వరకూ చిరంజీవిని సుప్రీం హీరో అని పిలిచేవారు. ఈ సినిమా తర్వాత చిరంజీవికి నిర్మాత కేఎస్ రామారావు మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చారు. ఇక అప్పటి నుంచి టైటిల్ కార్డ్స్‌లో చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ అని పడుతోంది. ఆ తర్వాత నాగబాబును మెగా బ్రదర్, రామ్ చరణ్‌ను మెగా పవర్ స్టార్, వరుణ్ తేజ్‌ను మెగా ప్రిన్స్, నిహారికను మెగా డాటర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు.